ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ రెండు దేశాల సైనికులు ప్రాణాలను కోల్పోతున్నారు.
అయితే తాజాగా ఒక ఉక్రేనియన్ సైనికుడు స్మార్ట్‌ఫోన్ కారణంగా తన ప్రాణాలను దక్కించుకోగలిగాడు.ఒక బుల్లెట్టు వేగంగా వచ్చి ఈ సైనికుడికి తగిలింది.
అయితే ఆ తగిలిన చోట స్మార్ట్‌ఫోన్ ఉండటంతో బుల్లెట్ స్మార్ట్ ఫోన్ కి తగిలింది తప్ప ఈ సైనికుడి శరీరంలోకి దూసుకెళ్లలేదు.దీంతో ఇతడు ప్రాణాలతో బయటపడగలిగాడు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఇద్దరు సైనికుల మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా చూడొచ్చు.
వారిలో ఒకరు తన జేబులో నుండి తన ఫోన్‌ను తీసి అందులో బుల్లెట్‌ను దిగినట్లు చూపించాడు.ఈ ఫోన్ కవర్ లోకి 7.2 మి.మీ పొడవు ఉన్న ఒక బుల్లెట్ చొచ్చుకుపోవడం మీరు గమనించవచ్చు.ఆ సైనికుడు మాట్లాడుతూ ఫోనే లేకపోతే తన శరీరంలోకి బుల్లెట్ వెళ్ళిపోయి ఉండేదని, ఇది తన ప్రాణాలనే తీసేసి ఉండేదని తన తోటి సైనికుడితో చెబుతూ కనిపించాడు.
రెడ్‌డిట్‌లో మొదటిసారి కనిపించిన ఈ 30 సెకన్ల నిడివి గల క్లిప్ ఇప్పుడు యూట్యూబ్ లో కూడా వైరల్ గా మారింది.ఉక్రేనియన్ సైనికుడిని మట్టుబెట్టాలని రష్యా సైనికులు ఈ 7.2 మి.మీ బుల్లెట్‌ను షూట్ చేశారు.బుల్లెట్ మరింత లోతుకు వెళ్లి ఉంటే, అది ప్రాణాంతకంగా ఉండేదని స్థానిక మీడియా తెలిపింది.
స్మార్ట్‌ఫోన్ కారణంగా ప్రాణాలతో బయటపడిన వారు ఎందరో ఉన్నారు.వారిలో తాజాగా ఉక్రేనియన్ సైనికుడు కూడా చేరాడు.
అయితే ఈ వైరల్ వీడియోపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఈ భూమి మీద నీకు ఇంకా నూకలు ఉన్నాయి, బ్రదర్ అందుకే బతికి పోయావు అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.
ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.