వావ్, భూ ఉపరితలం కింద ఆరవ మహా సముద్రం.. దాని విశేషాలివే..!

భూగ్రహం మీద ఆర్కిటిక్, సదరన్, ఇండియన్, అట్లాంటిక్, పసిఫిక్ అనే ఐదు మహాసముద్రాల ఉన్నాయని అందరికీ తెలుసు.అయితే ఒక కొత్త ఆవిష్కరణ భూ ఉపరితలం క్రింద ఆరవ మహాసముద్రం దాగి ఉండవచ్చనే బలమైన సంకేతాలను సూచించింది.

 Wow, The Sixth Great Sea Under The Surface Of The Earth.. Its Remarkable Rare Di-TeluguStop.com

బోట్స్వానాలో దొరికిన వజ్రంలో నీరు ఉన్న రింగ్‌వుడైట్ ఉనికిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.ఈ వజ్రం భూమి ఉపరితలం లోపల 660 కి.మీ కింద లభించింది.దీనిని జాగ్రఫీలో పరివర్తన జోన్ అంటారు.

శాస్త్రవేత్తలు ఈ డైమండ్‌కి సంబంధించిన అధ్యయనాన్ని ‘నేచర్ జియోసైన్స్‌’లో ప్రచురించారు.

లోతైన భూభాగంలో ఉన్న వజ్రంలో రింగ్‌వుడైట్ జాడలను శాస్త్రవేత్తలు కనుగొనడం ఇది రెండోసారి.

మొదటిది 2014లో కనుగొనడం జరిగింది.అప్పటి నుండి, భూగోళ శాస్త్రవేత్తలు భూమి మాంటిల్‌లో భూ గ్రహం మొత్తం బరువులో 1 శాతం నీరు ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఆ అభిప్రాయాలు నిజం చేసుకునేందుకు ఆధారాల కోసం వెతుకుతున్నారు.స్వేచ్ఛగా ప్రవహించే మహాసముద్రాలకు బదులుగా పోరస్ ఖనిజాల రూపంలో మహాసముద్రం వుందనే ఆలోచన ఇప్పుడు శాస్త్రవేత్తలకు నిద్ర లేకుండా చేస్తోంది.2017లో జరిగిన మరో అధ్యయనం ప్రకారం, భూమి ఉపరితలం క్రింద దాగి ఉన్న నీటి బరువు భూమి మహాసముద్రాలపై ఉన్న మొత్తం నీటి బరువుతో సమానంగా ఉంటుంది.

వజ్రం వంటి వస్తువులు భూమి ఉపరితలం క్రింద ఉన్న వాటి భౌతిక, రసాయన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు బాగా ఉపయోగపడతాయి.భూమి ఉపరితలం సగటు మందం 15-20 కిమీ పరిధిలో ఉంటుంది.భూమి మాంటిల్ 2,900 కి.మీ లోతుగా ఉంటుంది.అపారమైన పీడనం కారణంగా మాంటిల్ లోపలి పొర దాదాపుగా ఘన స్థితిలో ఉంటుంది.

అయితే బయటి పొర ఎక్కువగా ద్రవ స్థితిలో ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube