సోషల్ మీడియా వేదికగా వైరస్ అయ్యే చాలా వీడియోలు మనుషుల అద్భుతమైన ప్రతిభలను చూపిస్తుంటాయి.తాజాగా ఆ తరహా వీడియో ఒకటి వైరల్ గా మారింది.
ఈ వీడియోలోని ఒక వ్యక్తి టాలెంట్ చూసి చాలామంది వావ్ అంటున్నారు.వైరల్ అవుతున్న వీడియోలో ఒక స్టంట్ మ్యాన్ పరిగెత్తుకుంటూ రావడం మనం చూడవచ్చు.
అతని చుట్టూ 10 మంది దాకా వ్యక్తుల నిలుచున్నారు.వారి చేతిలో ఒక ఇనుప కడ్డీ ( An iron bar )ఉంది.
ఒక్కో ఇనుప కడ్డీకి ఒక వస్తువు అటాచ్ చేసి ఉంది.అయితే స్టంట్ మ్యాన్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి 360 డిగ్రీస్ కోణంలో తిరుగుతూ వాటిని తన కాళ్లతో కిక్ చేస్తూ బ్రేక్ చేశాడు.

మామూలుగా 360 డిగ్రీస్ కోణంలో అంత ఎత్తులో ఎగరడం చాలా కష్టం.అలాంటిది అతడు వస్తువులను పగలకొడుతూ తన అసాధారణమైన ప్రతిభను కనబరిచాడు.అందుకే ఈ వీడియో చూసి అందరూ ఇంక్రెడిబుల్( Incredible ) అని కామెంట్ చేస్తున్నారు.ఇది చాలా అరుదైన స్కిల్ అని మరికొందరు పేర్కొన్నారు.వీడియోలో కనిపిస్తున్న ఆ పొడి చెక్కల పొడి అని మరికొందరు అన్నారు.

ఫిజికల్ సైన్స్ బాగా ప్రాక్టీస్ చేసిన వారు మాత్రమే ఇలాంటి స్టంట్స్ చేయగలుగుతారని మరికొందరు అన్నారు.నిజానికి ఈ పని చేయడానికి చాలా టాలెంట్ తో పాటు ఓపిక, సాధన కూడా అవసరం.ఇలాంటి ఏమి రిస్కీ విన్యాసాలు చేసేటప్పుడు ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాంతక గాయాలయ్యే ముప్పు కూడా ఉంటుంది.
అందుకే ఇలాంటివి కొత్తవారు ప్రయత్నించకపోవడమే మంచిది.@ScienceGuys_ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు 5 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.
పదివేల దాకా లైక్స్ వచ్చాయి.దీనిని మీరు కూడా చూసేయండి.







