యువరాజ్ సింగ్( Yuvraj Singh )… క్రికెట్ గురించి తెలిసిన వారికి ఈ పేరు గురించి పరిచయం చేసే పని లేదు.ఇతడు ఎడమ చేతివాటం క్రికెటర్.1981 డిసెంబర్లో చండీగర్( Chandigarh ) లో యువరాజ్ సింగ్ జన్మించాడు.ఇతడు తండ్రి పంజాబ్ లో నటుడు అయినటువంటి యోగరాజ్( Yogaraj ).2000 సంవత్సరంలో క్రికెట్లోకి అడుగుపెట్టిన యువరాజ్, 2003 నుంచి టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత 2007లో ప్రపంచ కప్ లో స్టువర్టు బ్రాడ్ వేసిన ఆరు బాల్స్ కి ఆరు సిక్సులు కొట్టి ఇంటర్నేషనల్ క్రికెట్లో అరుదైన రికార్డుని సాధించిన క్రికెటర్ గా చరిత్రలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు.

యువరాజ్ మంచి ఆటగాడే కాదు అతని పేరు మీద ఎన్నో రికార్డ్స్ కూడా నెలకొని ఉన్నాయి.అయితే అతడు 2019 వరకు క్రికెట్ ఆడుతూ వచ్చాడు.ఆ ఏడాది జూన్ 10వ తారీఖున క్రికెట్ కి తన గుడ్ బై చెప్పేసాడు.
అయితే అంతకు ముందు అనేక విషయాల్లో యువరాజ్ సింగ్ పేరు సోషల్ మీడియాలో నానుతూ ఉండేది.అమ్మాయిలతో ఎఫైర్స్ విషయంలో, ఆట విషయంలో, తన స్నేహితులతో కల గొడవల విషయంలో యువరాజ్ పేరు ఎల్లప్పుడూ మీడియాకి మంచి పాయింట్ గా ఉండేది.
ఒకానొక టైంలో మహేంద్ర సింగ్( Mahendra Singh ) ధోనితో యువరాజ్ కి దీపికా పడుకునే విషయంలో గొడవలు జరిగాయని అందరూ అనుకునేవారు.ఆ తర్వాత ధోని కెప్టెన్ గా అయ్యాడు దాంతో యువరాజ్ యొక్క చరిత్ర కూడా మరుగున పడుతూ వచ్చింది.

అందుకు గల కారణాలను యువరాజ్ సింగ్ ఇటీవల ఇచ్చిన ఒక మీడియా ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా తెలియజేశాడు.తన కెరియర్ ఎండింగ్ కి వచ్చిన సమయంలో తాను ధోనితో మాట్లాడానని సెలక్షన్ కమిటీ నీ కోసం ఎదురు చూడటం లేదని నిన్ను ఆటలోకి తీసుకోవాలని అనుకోవడం లేదని ధోని యువరాజ్ తో చెప్పాడట.అయితే తామెప్పుడూ స్నేహితులము కాదని ధోని లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ వేరుగా ఉండేవని, అందువల్ల మేము క్లోజ్ ఫ్రెండ్స్ కాలేకపోయామని, కేవలం క్రికెట్ ఆడటం వల్లే ఇద్దరు స్నేహితులను అయ్యాము కానీ ఏ రకంగానూ మాకు క్లోజ్నెస్ లేదు అంటూ చెప్పాడు.అందువల్లే తాను క్రికెట్ కి దూరం అయ్యానని ఇన్ డైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశాడు యువరాజ్ సింగ్.







