ఈ పక్షిని డాల్ఫిన్ ఎలా ఆట పట్టించిందో చూస్తే ఆశ్చర్యపోతారంతే!

సాధారణంగా డాల్ఫిన్లు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాయి.వీటి అసాధారణమైన తెలివికి ఆశ్చర్యపోక తప్పదు.

 Would Be Amazed To See How The Dolphin Played This Bird, Bird, Playing, Dolphin-TeluguStop.com

అయితే తాజాగా ఒక చిలిపి డాల్ఫిన్ ఒక సీగల్ పక్షిని ఒక ఆట ఆడించింది.అది ఎంత తెలివిగా పక్షిని ఆట పట్టించిందో చూస్తే మీరు నవ్వడమే కాదు ఆశ్చర్యపోతారు కూడా.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక డాల్ఫిన్ నీటిలో ఉండటం గమనించవచ్చు.

అయితే ఈ నీటి ఒడ్డున ఒక ఒక సీగల్ పక్షి నిల్చుంది.ఇది గమనించిన డాల్ఫిన్ ఒక చేపను పట్టుకుని పక్షికి చూపిస్తూ దానికి నోరూరించింది.

కావాలంటే ఈ చేపని పట్టుకో అన్నట్లు దాన్ని గాల్లోకి విసిరితూ డాల్ఫిన్ క్యాచ్ పట్టింది.అలా చాలా సేపు చేపని నోటితో పైకి విసురుతూ పక్షిని టీజ్ చేసింది.

చివరికి ఆ పక్షి ఈ చేపను డాల్ఫిన్ దగ్గర్నుంచి తీసుకోవాలని ప్రయత్నించింది కానీ విఫలమయ్యింది.అయితే మనుషుల్లోనే కాదు డాల్ఫిన్లలో కూడా చిలిపితనం ఉంటుందని ఈ వీడియోతో రుజువయ్యిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

@Pubity అనే ఇన్ స్టాగ్రామ్ పేజీని ఈ వీడియోని షేర్ చేసింది.దీనికి ఇప్పటికే దాదాపు ఐదు లక్షల లైకులు, మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.దీనిపై నెటిజన్లు చాలా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.ఆటపట్టించేదేమో డాల్ఫిన్, దాన్ని చూసేదేమో పక్షి, మధ్యలో నేనేమైనా వెర్రిదాన్నా? అని చేప ఫీల్ అయి ఉంటుందేమోనని కొంతమంది ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.అయితే డాల్ఫిన్ పక్షిని పట్టుకొని తినేందుకు ఇలా చేపని ఎరగా విసురుతూ ట్రిక్స్ ప్లే చేస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.ఈ అమేజింగ్ వీడియో ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube