కోర్టు కేసులలో శిక్షల శాతం పెరిగేలా పని చేయాలి :జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.,

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయం( Rajanna Sircilla Police Office )లో కోర్టు డ్యూటీ అధికారులకు నిర్వహించిన సమావేశం లో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.

కోర్టు కేసులలో శిక్షల శాతాన్ని పెంచడం, తప్పు చేసిన నిందితులకు శిక్ష పడేలా చేయడం ద్వారా ప్రజలకు పోలీస్ శాఖపై మరింత గౌరవం, నమ్మకం పెరుగుతుందని అన్నారు.

కేసుల్లో శిక్షల అమలు, పెండింగ్ కేసుల పరిష్కారానికి( Pending Cases ) సంబంధించి పలువురు కోర్టు కానిస్టేబుళ్లను అడిగి కేసుల పురోగతిపై సూచనలు చేశారు.కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులు, కోర్టులో పెండింగ్ కేసులపై, వారెంట్స్, సమన్స్ తదితర అంశాలను సమీక్షించారు.

కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని, ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుండి కేసు పూర్తయ్యేంతవరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల వాగ్మూలం ను కోర్టుకు సమర్పించడంలో కోర్టు పోలీసు అధికారుల పనితీరులో వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని సూచించారు.కేసుల్లో నిందుతులను దోషులుగా నిరూపించి శిక్షలు పడేలా పని చేయాలని, కోర్టు అధికారులు సమన్వయంతో పని చేయడం ద్వారా సాక్షులను, నింధితులను, బాధితులను సమయానికి కోర్టులో హాజరు పరిచేలా చూసుకోవాలని చెప్పారు.

బాధితులకు, సాక్షులకు కేసుకు సంబంధించిన విషయాలలో అవగాహన కల్పించాలని తెలిపారు.కోర్టు కేసుల్లో నిందుతులకు శిక్షలు పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, ఇందుకు అనుగుణంగా కేసులు పెండింగులో లేకుండా చూసుకోవాలని అన్నారు.

Advertisement

కోర్టు సమాచారం ప్రాసిక్యూషన్ కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు తెలియజేయాలని, కేసు ట్రయల్స్ సమయములో పీపీ ల యొక్క సలహాలు సూచనలు స్వీకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ లు శశిధర్ రెడ్డి, డీసీఆర్బీ సి.ఐ రఘుపతి, సి ఎం ఎస్ ఎస్.ఐ శ్రీకాంత్ కోర్ట్ డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News