వైట్ చాక్లెట్ గురించి ఈ విష‌యాలు తెలిస్తే తిన‌కుండా ఉండ‌లేర‌ట‌!

చాక్లెట్స్‌లో రెండు ర‌కాలు.ఒకటి డార్క్ కాగా, మ‌రొక‌టి వైట్ చాక్లెట్‌.

డార్క్ చాక్లెట్ గురించి త‌ర‌చూ వింటూనే ఉంటాము.

ఆరోగ్యానికి మంచిద‌ని, రెగ్యుల‌ర్‌గా డార్క్ చాక్లెట్‌ను తీసుకుంటే అనేక జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చ‌ని నిపుణులు చెబుతూనే ఉంటాయి.

అయితే వైట్ చాక్లెట్‌తో కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.కానీ, చాలా మందికి వైట్ చాక్లెట్ గురించి స‌రిగ్గా అవ‌గాహ‌న లేక వాటిని ప‌క్క‌న పెటేస్తుంటారు.

అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యాలు తెలిసుకుంటే వైట్ చాక్లెట్‌ను తిన‌కుండా ఉండ‌లేర‌ట‌.మ‌రి లేటెందుకు అస‌లు మ్యాట‌ర్‌లోకి ప‌దండీ.

Advertisement

వైట్ చాక్లెట్స్‌ రుచిగా ఉండ‌ట‌మే కాదు.విట‌మిన్ బి, పొటాషియం, కాల్షియం, ఐర‌న్‌, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు కూడా క‌లిగి ఉంటాయి.

అందుకే వైట్ చాక్లెట్స్ బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.ముఖ్యంగా అధిక ర‌క్త పోటుతో బాధ ప‌డే వారు ప్ర‌తి రోజు త‌గిన మోతాదు వైట్ చాక్లెట్‌ను తీసుకుంటే ర‌క్త పోటు స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి.

అదే స‌మ‌యంలో గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు ప‌రుస్తాయి.

అలాగే మ‌హిళ‌ల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వ‌చ్చే రిస్క్‌ను త‌గ్గించ‌డంలో వైట్ చాక్లెట్స్ ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తాయి.అందు వ‌ల్ల‌నే స్త్రీల‌ను తమ డైట్‌లో వైట్ చాక్లెట్స్‌ను చేర్చుకోమ‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.నిద్ర‌లేమి బాధితుల‌కు బెస్ట్‌గా ఆప్ష‌న్‌గా వైట్ చాక్లెట్‌ను చెప్పుకోవ‌చ్చు.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

అవును, రెగ్యుల‌ర్‌గా త‌గిన మోతాదులో వైట్ చాక్లెట్‌ను తీసుకుంటే అందులో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన పోష‌కాలు మంచి నిద్ర‌ను అందిస్తాయి.మ‌రియు నిద్ర లేమి వ‌ల్ల వ‌చ్చే ఒత్తిడి, డిప్రెష‌న్‌, చికాకు వంటి స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి.

Advertisement

అంతేనా.వైట్ చాక్లెట్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అతి ఆక‌లి త‌గ్గు ముఖం ప‌డుతుంది.

మెద‌డు ప‌ని తీరు మెరుగు ప‌డుతుంది.మ‌తి మ‌రుపు ద‌రి చేర‌కుండా ఉంటుంది.

రోగ నిరోధ‌క శ‌క్తి రెట్టింపు అవుతుంది.మ‌రియు బలహీన‌మైన ఎముకలు, దంతాలు దృఢంగా మార‌తాయి.

కాబ‌ట్టి, వైట్ చాక్లెట్‌ను అస్స‌లు ఎవైడ్ చేయ‌కండి.అయితే మంచిది క‌దా అని అతిగా కూడా తీసుకోరాదు.

తాజా వార్తలు