శొంఠి పొడి రెగ్యుల‌ర్‌గా తింటే..ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

శొంఠి పురాత‌న కాలం నుంచి దీనిని ఆయుర్వేదంలో విరి విరిగా వాడుతున్నారు.అల్లం ద్వారానే శొంఠిని త‌యారు చేస్తారు.

ప‌చ్చి అల్లంను పాల‌లో ఉడ‌క బెట్టి ఆ త‌రువాత ఎండ‌బెడ‌తారు.దాంతో శొంఠి కొమ్ములు త‌యార‌వుతాయి.

ఈ శొంఠి కొమ్ముల‌ను పొడిగా చేసి వాడుతుంటారు.శొంఠి పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ అందుతాయి.

ముఖ్యంగా ఈ వ‌ర్షా కాలంలో రెగ్యుల‌ర్‌గా శొంఠి పొడి తీసుకుంటే ఎన్నో జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చు.మ‌రి శొంఠి పొడిని ఎలా వాడాలి? శొంఠిని తీసుకోవ‌డం వ‌ల్ల పొందే ప్ర‌యోజ‌నాలు ఏంటీ? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఈ వ‌ర్షాకాలంలో జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు త‌ర‌చూ ఇబ్బంది పెడుతుంటాయి.

Advertisement
Wonderful Health Benefits Of Sonti! Health, Benefits Of Sonti, Sonti, Dry Ginger

అయితే ఈ సీజ‌న‌ల్ వ్యాధుల‌ను నివారించ‌డంలో శొంఠి పొడి అద్భుతంగా స‌హాయ‌ ప‌డుతుంది.ఒక గ్లాస్ నీటిలో అర స్పూన్ శొంఠి పొడి, పావు స్పూన్ ల‌వంగాల పొడి వేసి బాగా మ‌రిగించి వ‌డ‌బోసుకోవాలి.

ఈ నీటిని గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత తీసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

Wonderful Health Benefits Of Sonti Health, Benefits Of Sonti, Sonti, Dry Ginger

అలాగే ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో అర స్పూన్ శొంఠి పొడి వేసి బాగా మిక్స్ తీసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో అద‌నంగా పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది.దాంతో బ‌రువు త‌గ్గుతారు.

Wonderful Health Benefits Of Sonti Health, Benefits Of Sonti, Sonti, Dry Ginger

వేడి పాలల్లో శొంఠి పొడిని కలుపుకొని తాగితే ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది.కీళ్ల నొప్పులు మ‌టుమాయం అవుతాయి.మ‌రియు గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ కూడా త‌గ్గు ముఖం ప‌డుతుంది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

ఇక పరగడుపున నీళ్లల్లో శొంఠి పొడి కలిపి మరగించి అర స్పూన్ తేనె కలిపి తాగితే అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి జీర్ణ స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు కూడా మెరుగు పడుతుంది.

Advertisement

తాజా వార్తలు