అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

అర‌టి పండు రుచిగా ఉండ‌టంతో పాటుగా.ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది.

ఎన్నో జ‌బ్బుల‌ను నివారిస్తుంది.

ఎందుకంటే, అర‌టి పండులో విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ఫైబ‌ర్‌, ప్రోటీన్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు నిండి ఉంటాయి.

అందు వ‌ల్ల‌నే, అంద‌రూ అర‌టి పండును ఇష్టంగా తింటుంటారు.అయితే అర‌టి పండు మాత్ర‌మే కాదు అర‌టి కాయ కూడా ఆరోగ్యానికి అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

త‌ర‌చూ అర‌టి కాయ‌తో త‌యారు చేసిన వంట‌ల‌ను తీసుకుంటే గ‌నుక బోలెడ‌న్ని బెనిఫిట్స్ పొందొచ్చు.మ‌రి అవేంటో ఆల‌స్యం చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

Advertisement
Wonderful Health Benefits Of Raw Banana! Health, Benefits Of Raw Banana, Raw Ban

అర‌టి కాయ‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల‌.అందులో పుష్క‌లంగా ఉండే పొటాషియం కంటెంట్ బ్రెయిన్‌ను చురుగ్గా మారుస్తుంది.

మ‌రియు మ‌తిమ‌రుపును నివారిస్తుంది.బ‌రువు త‌గ్గాలి అని భావించే వారు అర‌టి కాయ‌తో త‌యారు చేసిన వంట‌ల‌ను తీసుకోవ‌డం ఉత్త‌మం.

అర‌టి కాయ వంట‌ల‌ను తీసుకుంటే అతి ఆక‌లి త‌గ్గు ముఖం ప‌డుతుంది.అదే స‌మ‌యంలో శ‌రీరంలో పేరుకు పోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది.

ఫ‌లితంగా వెయిట్ లాస్ అవుతారు.ఎముక‌ల బ‌ల‌హీన‌త‌కు చెక్ పెట్ట‌డంలోనూ అర‌టి కాయ స‌హాయ‌ప‌డుతుంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

త‌ర‌చూ అర‌టి కాయ‌ను తీసుకుంటే.బ‌ల‌హీన‌మైన‌ ఎముక‌లు, కండ‌రాలు బ‌లంగా మార‌తాయి.

Wonderful Health Benefits Of Raw Banana Health, Benefits Of Raw Banana, Raw Ban
Advertisement

అర‌టి కాయ‌ల్లో ఫైబ‌ర్ కంటెంట్ స‌మృద్ధిగా ఉంటుంది.అందు వ‌ల్ల‌, వీటిని డైట్‌లో చేర్చుకుంటే మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య దూరం అవుతుంది.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగుప‌డుతుంది.

అర‌టి కాయ‌ల్లో విటిమ‌న్ సి కూడా ఉంటుంది.కాబ‌ట్టి, త‌ర‌చూ అర‌టి కాయ వంట‌ల‌ను ఆహారంలో భాగంగా చేర్చుకుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

దాంతో వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్లు, ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్లు, వైర‌ల్ జ్వ‌రాలు ద‌రి చేర‌కుండా ఉంటాయి.ఇక అర‌టి కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల నీర‌సం పోయి శ‌రీరానికి బోలెడంత శ‌క్తి ల‌భిస్తుంది.

అజీర్తి ద‌రి చేర‌కుండా ఉంటుంది.శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు కూడా బ‌య‌ట‌కు పోతాయి.

తాజా వార్తలు