దేశవ్యాప్తంగా మహిళలు, యువతులపై రోజురోజుకూ లైంగికదాడులు, అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి.ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా దుండగులకు చుట్టంలా మారుతున్న పరిస్థితి.
రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అరాచకాలు సాగుతున్నాయి.కొందరు మానవ మృగాలు మాత్రం మారట్లేదు.
నిత్యం పోలీసుల నిఘా ఉన్నా మహిళలపై లైంగికదాడులు ఆగట్లేదు. మద్యం మత్తులో ఏం చేస్తున్నామని తెలియకుండా మహిళలు, బాలికలపై ఇలా వయోబేధం లేకుండా హత్యాచారాలకు తెగబడుతున్నారు.
తాజాగా కృష్టా జిల్లా మచిలీపట్నంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది .యువతిపై కొందరు కామాంధులు సామూహికంగా అత్యాచారం చేశారు.ఆమె తన ప్రేమికుడితో ఉండగానే దుండగులు ఈ ఘోరానికి ఒడిగట్టారు.అతన్ని తాడుతో కట్టేసి అతని ముందే అత్యాచారం చేశారు.
మచిలీపట్నంలోని ఫిషింగ్ హార్బర్ చూసేందుకు సముద్ర తీరానికి ప్రేమ జంట వెళ్లింది.కాగా ఈ జంటపై దుండగులు ఇలాంటి దారుణానికి ఒడిగట్టారు.
కాని విషయం తల్లిదండ్రులకు తెలిసి బందర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
లైంగికదాడికి పాల్పడిన నాగబాబు అనే వ్యక్తి ఉన్నాడని గుర్తించారు.అతనిపై కేసు నమోదు చేసి బాధితురాలు ఓ కళాశాల విద్యార్థిగా గుర్తించారు.

సదరు యువతి తన ప్రియుడు కలిసి బీచ్‌కు వెళ్లారు.అక్కడే మాట్లాడుకుంటుండగా ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి వారి వద్దకు వచ్చారు.యువకుడిని కొట్టి చెట్టుకు కట్టేసి యువతిపై బలాత్కారానికి ఒడిగట్టారు.ఈ విషయం వారు ఎవరికీ చెప్పుకోలేక సైలెంట్‌గా ఉన్నారు.సదరు విద్యార్థిని గమనించిన ఆమె సోదరుడు నిలదీయడంతో జరిగిన విషయం వెలుగులోకొచ్చింది.వెంటనే కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు నాగబాబు ను అరెస్ట్ చేశారు.
మరో నిందితుడు పరారీ లో ఉన్నట్టు ఎస్సై వాసు తెలిపారు.







