నిమ్మ‌కాయ‌లే కాదు.. నిమ్మ ఆకుల‌తో కూడా మ‌స్తు బెనిఫిట్స్‌!

నిమ్మ‌కాయ.దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

వంట‌ల్లో నిమ్మ‌కాయ‌ల‌ను విరి విరిగా ఉప‌యోగిస్తారు.

అలాగే బ‌రువు త‌గ్గేందుకు నిమ్మ‌కాయ‌ల‌ను ఉప‌యోగిస్తారు.

ఇక అనేక పోష‌కాలు నిండి ఉండే నిమ్మ‌కాయ‌లు ఆరోగ్య ప‌రంగా, సౌంద‌ర్య ప‌రంగా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.అయితే కేవ‌లం నిమ్మ‌కాయ‌లే కాదు.

నిమ్మ ఆకులతో కూడా మ‌స్తు బెనిఫిట్స్ ఉన్నాయి.కానీ, చాలా మందికి నిమ్మ ఆకుల‌తో క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి అవ‌గాహ‌న లేదు.

Advertisement
Wonderful Health Benefits Of Lemon Leaves! Health, Benefits Of Lemon Leaves, Lem

అలాంటి వారికి ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యాలు ఖ‌చ్చితంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డే వారికి నిమ‌మ ఆకులు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

లేత‌గా ఉండే నిమ్మ ఆకుల‌ను తీసుకుని నీటిలో శుభ్రం చేసుకుని.లైట్‌గా పేస్ట్ చేయాలి.

ఈ పేస్ట్‌ను ప‌ళ్ల‌కు అప్లై చేసి.ఐదు నిమిషాల త‌ర్వాత వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే నోటి దుర్వాస‌న స‌మ‌స్య దూరం అవుతుంది.అలాగే ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డిన‌ప్పుడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

కొన్ని నిమ్మ ఆకుల‌ను తీసుకుని మెత్త‌గా నోరి స్మెల్ పిలుస్తూ ఉండాలి.ఇలా చేస్తే చాలా త్వ‌ర‌గా రిలీఫ్ పొందుతారు.

Wonderful Health Benefits Of Lemon Leaves Health, Benefits Of Lemon Leaves, Lem
Advertisement

ఇక ఒక గ్లాస్ వాట‌ర్‌లో మూడు లేదా నాలుగు నిమ్మ ఆకుల‌ను వేసి బాగా మ‌రిగించి వ‌డ‌గ‌ట్టుకోవాలి.ఈ వాట‌ర్‌ను గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత సేవించాలి.ఈ వాట‌ర్ తీసుకోవ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

అలాగే మైగ్రేన్‌ తలనొప్పితో ఇబ్బంది ప‌డే వారు.ఒక గ్లాస్ వాట‌ర్‌లో నాలుగు, ఐదు ఆకుల‌ను వేసి రాత్రంతా నాన బెట్టుకోవాలి.

ఉద‌యాన్నే ఆ నీటిని తాగాలి.ఇలా చేస్తే మైగ్రేన్ మాత్ర‌మే కాదు.

నిద్రలేమి సమస్య, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.మచ్చలు, మొటిమలను పోగొట్ట‌డంలోనూ నిమ్మ ఆకులు తోడ్ప‌డ‌తాయి.

నిమ్మ ఆకుల‌ను పేస్ట్ చేసి కొద్దిగా తేనె క‌లిపి ముఖానికి రాస్తే.మంచి ఫ‌లితం ఉంటుంది.

తాజా వార్తలు