ఖ‌ర్జూరంతో ఇలా చేస్తే.. వ‌ద్ద‌న్నా అందంగా మెరిసిపోతారు!

ఖ‌ర్జూరం.చాలా మంది ఇష్టంగా తినే పండ్ల‌లో ఇవి కూడా ఒకటి.

ఎన్నో పోష‌కాలు నిండి ఉన్న ఖ‌ర్జూరాలు ఆరోగ్యానికి అనేక‌ ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.

గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంలోనూ, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలోనూ, జీర్ణ వ్య‌వ‌స్థ‌ను చురుగ్గా ప‌ని చేసేలా ప్రోత్స‌హించ‌డంలోనూ, ప్రాణాంత‌క‌మైన క్యాన్స‌ర్ స‌మ‌స్య వ‌చ్చే రిస్క్‌ను త‌గ్గించడంలోనూ, ఎముకలలో పటుత్వాన్ని పెంచ‌డంలోనూ, శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెంచ‌డంలోనూ ఇలా ఎన్నో విధాలుగా ఖ‌ర్జూరం మ‌న‌కు స‌హాయ‌‌ప‌డుతుంది.

ఇక కేవ‌లం ఆరోగ్య‌ప‌రంగానే కాదు.సౌంద‌ర్య ప‌రంగానూ ఖ‌ర్జూరం ఉప‌యోగ‌ప‌డుతుంది.

కానీ, ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు.మ‌రి ఇంత‌కీ ఖ‌ర్జూరంను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా ఖ‌ర్జూరంలోని గింజ‌లు తీసేసి. నీటిలో నాన‌బెట్టుకోవాలి.

బాగా నానిన త‌ర్వాత పేస్ట్ చేసుకుని.అందులో కొద్దిగా తేనె వేసి మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.అగంట త‌ర్వాత చ‌ల్లిటి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.ముఖంపై న‌ల్ల మ‌చ్చ‌లు, సన్న‌ని గీత‌లు పోయి కాంతివంతంగా మారుతుంది.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?

అలాగే ఖ‌ర్జూరంను పాల‌లో రాత్రే నాన‌బెట్టుకుని.ఉద‌యాన్నే పేస్ట్ చేసుకోవాలి.అందులో కొద్దిగా ప‌సుపు మ‌రియు గ్రంధం పొడి వేసి క‌లుపుకోవాలి.

Advertisement

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.బాగా ఆరిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా రెండు రోజుల‌కు ఒక‌సారి చేస్తే.ముడ‌త‌లు, మొటిమ‌లు పోయి ముఖం అందంగా మారుతుంది.

ఇక ఖ‌ర్జూరంను గింజ‌లు తీసి నీటిలో నాన‌బెట్టుకుని పేస్ట్ చేసుకోవాలి.ఆ పేస్ట్‌లో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి.

ముఖానికి బాగా అప్లై చేయాలి.ఇర‌వై నుంచి ముప్పై నిమిషాలు వ‌దిలేసి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి మూడు సార్లు చేస్తే.మంచి రంగు సంత‌రించుకోవ‌డంతో పాటు ముఖం ప్ర‌కాశ‌వంతంగా మెరుస్తుంది.

తాజా వార్తలు