రెండు చేతులు లేకున్నా ఈ సోదరి తన సొంత కష్టంతోనే బతుకుతుంది.. ఈమె మనందరికి కూడా ఆదర్శం

రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్న వారు, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వారు కూడా కష్టం చేత కాక అడుక్కుని తింటున్నారు.మరి కొందరు తల్లిదండ్రుల లేదంటే ఇంట్లో వారి కష్టంను తింటూ ఉంటారు.

 Women Living With Her Own Difficulties Even If Not Two Hands-TeluguStop.com

కాని బంగ్లాదేశ్‌కు చెందిన బాను అక్తర్‌ మాత్రం అలా కాదు.రెండు చేతులు లేకున్నా కూడా ఒకరిపై ఆధారపడవద్దని భావించింది.

తన జీవితాన్ని కష్టపడి మాత్రమే సాగించాలనుకుంది.అడుకోవ్వాలని కొందరు బలవంతం చేసినా కూడా తాను మాత్రం కష్టపడి సంపాదించి నా జీవితాన్ని నేను గడపాలని భావించింది.

కష్టపడేందుకు ఆమె ఎంతో మంది వద్దకు వెళ్లి పని కావాలని కోరింది.కాని ఏ ఒక్కరు కూడా ఆమెకు పని ఇచ్చేందుకు ముందుకు రాలేదు.ఆమెకు రెండు చేతులు లేక పోవడంతో నువ్వేం పని చేస్తావంటూ నవ్వి సాయంగా అంతో ఇంతో ఇస్తాం తీసుకు వెళ్లు అనే వారు.కాని ఆమె మాత్రం సాయం తనకు అవసరం లేదు, పని ఉంటే ఇవ్వడం అంటూ వెళ్లి వచ్చేది.

ఇక లాభం లేదని సొంతంగానే పని చేసుకుని డబ్బులు సంపాదించాలని భావించింది.

అందుకోసం మొదట టైలరింగ్‌ నేర్చుకుంది.రెండు చేతులు లేని ఆమె చాలా కష్టపడి నేర్చుకుంది.సాదారణ వ్యక్తుల కంటే కూడా భాగా ఆమె ఇప్పుడు టైరింగ్‌ చేయగలుగుతుంది.

తనకు తగ్గట్లుగా ఒక మిషన్‌ రెడీ చేయించుకుంది.కట్టింగ్‌ కూడా తానే చేసుకుంటుంది.

ఆమె సూదిలో దారం రెండు కాళ్లతో ఎక్కించడం గ్రేట్‌.డ్రస్‌లు ఆమె వద్ద కుట్టించుకునేందుకు జనాలు క్యూలు కడుతున్నారు.

ఆమెకు సాయంగా నిలవాలనుకునే వారు ఆమెకు ఇలా పని కల్పించి సాయం చేయవచ్చు అనుకుంటున్నారు.

ఇక టైలరింగ్‌ మాత్రమే కాకుండా సాదారణంగా రెండు చేతులు బాగా ఉన్న వారికి కూడా కష్టం అయ్యే పూసల డిజైన్స్‌, పూసలతో వస్తువులను తయారు చేయడం కూడా బాను అక్తర్‌ నేర్చుకున్నారు.దాంతో కూడా బాగానే సంపాదిస్తున్నట్లుగా చెబుతుంది.తన జీవితంను చూసి ఎవరు జాలి చూపాలని నేను అనుకోను అని, నన్ను చూసి నలుగురు మారి, నన్ను ఆదర్శంగా తీసుకుని కష్టపడాలని భావిస్తాను అంటూ బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాను అక్తర్‌ చెప్పుకొచ్చింది.

బాను అక్తర్‌ కష్ట పడటం ఇష్టం లేక ఏదైనా సులువు జాబ్‌ కావాలని కోరుకునే వారికి ఆదర్శం అని చెప్పుకోవచ్చు.ఆమెలా కష్టపడితే అద్బుతమైన ఫలితాలు వస్తాయి.

ఈ కథనం కొందరిలో అయినా మార్పు తేవాలని కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube