ఏపీకి మహిళా సీఎం ? ఇందులో నిజం ఉందంటగా ?

ఏపీకి మహిళా సీఎం అంటూ విజయవాడ నుంచి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరు వరప్రసాద్ చేసిన ట్విట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

ఆ ట్విట్ ను ఆయన వెంటనే తొలిగించినా అసలు ఆయన ఇటువంటి ట్విట్ చేయడం వెనుక కారణాలు ఏంటి ఆయన ఆలోచనలో నిజమెంత అని విశ్లేషణలు కూడా మొదలయ్యాయి.

పొట్లూరి చేసిన ట్విట్ లో నిజం లేకపోలేదు.అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

ఏపీకి మహిళా సీఎం అంటే ఖచ్చితంగా జగన్ భార్య వైఎస్ భారతిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోంది.జగన్ జైలుకు వెళ్తాడని పీవీపీ కి ఖచ్చితమైన సమాచారం ఉండబట్టే ఆయన ఈ విధంగా ట్విట్ చేసినట్లు అర్థం అవుతోంది.

జగన్ జైలుకు వెళతాడు అనే వాదనకు కారణాలు కూడా లేకపోలేదు.ఆయన దాదాపు 11 కేసుల్లో ఎ 1 గా ఉన్నాడు.ప్రస్తుతం ఈ కేసులు సిబిఐ కోర్ట్ లో విచారణ జరుగుతోంది.

Advertisement

కానీ జగన్ గతేడాది ఒకసారి మాత్రమే కోర్టుకు హాజరయ్యారు.తాను ఏపీకి సీఎం గా ఉన్నాను కాబట్టి తన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పదే పదే జగన్ కోర్టులో పిటిషన్ లు వేస్తున్నారు.

ఇప్పటికే ట్రయల్ కోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు లో ఉంది.

అక్కడ సీబీఐ చేసిన వాదనలు చూస్తే జగన్ కు బెయిల్ వస్తుందా అనేది అనుమానంగానే ఉంది.ఎందుకంటే జగన్ బెయిల్ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని, ఆయన కోర్టుకు రావడంలేదని హైకోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ వేశారు.

జగన్ పై తీవ్ర స్థాయిలో ఆర్ధిక నేరాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దు అంటూ సీబీఐ వాదిస్తోంది.జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నా ఆయన వెళ్లకుండా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నారు.జగన్ కేసులో తీర్పు ఇప్పటికిప్పుడు రాకపోయినా వరుసగా కోర్టుకు హాజరుకాకపోవడంతో ఏ క్షణమైనా జగన్ జైలుకు వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

అందుకే ఇప్పుడు దానిని దృష్టిలో పెట్టుకుని పొట్లూరి వరప్రసాద్ ఈ విధంగా వ్యాక్యాలు చేసినట్టు అర్థం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు