లతీషా జోన్స్( Latiesha Jones ) అనే 22 ఏళ్ల బయోమెడికల్ సైన్స్ స్టూడెంట్ తన ఉమ్మును అమ్ముకుంటూ లక్షలాది రూపాయలను సంపాదిస్తోంది.నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం.
మాంచెస్టర్‌లోని పార్ట్‌టైమ్ టెస్కో ఉద్యోగి అయిన ఈ యువతి డబ్బు సంపాదించడానికి, తన అప్పులను తీర్చడానికి బాగా ఆలోచించి ఒక వినూత్నమైన మార్గాన్ని కనుగొన్నది.తన స్పిట్ అంటే ఉమ్ము, గోళ్లు, వారం రోజులు ఉపయోగించిన బెడ్షీట్లు వంటి ప్రత్యేకమైన వస్తువులకు డిమాండ్ ఉందని ఆమె తెలుసుకుంది.
ప్రజలు వాటి కోసం డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె కనుగొంది.ఇంకేం ఆలస్యం చేయకుండా వెంటనే వాటిని విక్రయించడం ప్రారంభించింది.
మొదట్లో లతీషా పని చేస్తూ, చదువుకుంటూనే హస్టల్ సమీపంలో పైన పేర్కొన్న వస్తువులను అమ్మడం ప్రారంభించింది.ఈ వింత అభ్యర్థనలను నెరవేర్చినందుకు తాను రూ.30,000 నుంచి రూ.1.5 లక్షల వరకు సంపాదించవచ్చని త్వరగానే అర్థం చేసుకున్నది.తర్వాత ఈ వస్తువులకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని వీటిని అమ్మడం పైనే శ్రద్ధ పెట్టింది.
టెస్కోలో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టింది.ఫుల్ టైమ్ తన కొత్త వెంచర్‌పై దృష్టి పెట్టడానికి యూనివర్సిటీలో చదువు ఆపేయాలని నిర్ణయించుకుంది.
లతీషా దాదాపు రూ.10 లక్షల రుణాన్ని ఈ వస్తువులు అమ్మడం ద్వారా వచ్చిన సంపాదనతోనే చెల్లించింది.అంతేకాదు, ఈ అసాధారణ వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించి ఓ ఫ్లాట్‌ను కూడా కొనుగోలు చేసినట్లు పేర్కొంది.ఆమె ఓన్లీ ఫ్యాన్స్ అకౌంట్ ప్రారంభించినప్పుడు, షవర్ వాటర్‌తో సహా వివిధ వస్తువుల కోసం విచిత్రమైన అభ్యర్థనలను స్వీకరించింది.
ఇలాంటి వాటిని పురుషుల అడుగుతున్నప్పుడు వాటిని ఎక్కువ దారకు ఎందుకు అమ్మకూడదని ఆమెలో ఒక ఆలోచన మొదలైంది.సాధారణంగా వీటిని ఎవరూ అమ్మరు.
కానీ డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి తాను తన ఉమ్ము, గోళ్ళ క్లిప్పింగులు, వారం రోజుల పాటు వాడేసిన బెడ్షీట్లు అమ్మకానికి పెట్టింది.ఆమె తన మొదటి బాటిల్ ఉమ్మి కోసం రూ.30,000 వసూలు చేసింది.ఒక వారం పాటు పడుకున్న బెడ్షీట్లు, చెమటలు పట్టే జిమ్ బట్టలు, బాత్ వాటర్, ఉపయోగించిన టూత్ బ్రష్‌లు, టూత్‌పేస్ట్ ఉమ్మివేయడం వంటి అనేక రకాల వస్తువుల కోసం కూడా ఆమెకు అభ్యర్థనలు వచ్చాయి.
లతీషా తనకు వచ్చిన వివిధ రకాల అభ్యర్థనలను చూసి ఆశ్చర్యపోయింది.తర్వాత ఆ రిక్వెస్ట్‌లకు అనుగుణంగా వారి కోరికలను తీర్చి డబ్బులు సంపాదించింది.ఇది తన కెరీర్‌గా మారుతుందని లతీషా ఎప్పుడూ ఊహించనప్పటికీ, ఆమె తన అసాధారణ వ్యాపారంతో సంతోషంగా ఉందట.