ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ముందుగా మనం ఇంట్లోనే ప్రథమ చికిత్స చేసుకుంటాం.ఇంట్లోనే ఉండి రోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తాం.
దీని కోసం అనేక ఇంటి చిట్కాలను పాటిస్తూ ఉంటాం.జ్వరం, జలుబు, కడుపునొప్పి లాంటి సమస్యలు వచ్చినప్పుడు ముందుగా చిట్కాలను పాటిస్తాం.
అప్పటికీ తగ్గకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్లి చికిత్స చేయించుకుంటాం.డాక్టర్లు ఇచ్చే ఇంజెక్షన్లు, మెడిసిన్స్ వాడితే అప్పుడు రోగం తగ్గే అవకాశం ఉంటుంది.
అయితే ఇంట్లోని చిట్కాలు అన్ని వేళలా పనిచేయవు.ఒక్కొసారి వాటి వల్ల సమస్య మరింత తీవ్రతరం కావొచ్చు.రోగం ముదిరే లోపు ఇంట్లోని చిట్కాలు పాటించి చికిత్స తీసుకుంటే మరింత ప్రమాదకరం అవుతుంది.ఇలాంటి ఘటనే ఒకటి పశ్చిమబెంగాల్ లో చోటుచేసుకుంది.
పశ్చిమబెంగాల్ లోని బంకురా జిల్లాకు చెందిన హీరా షేక్ అనే మహిళ గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుంది.అయితే స్వల్పంగానే కడుపునొప్పి ఉంది కదా అని ఆమె పెద్దగా పట్టించుకోలేదు.
ఇంట్లోని ఉండి చిట్కాలు పాటించి సొంత వైద్యం చోసుకుంటోంది.అయితే ఉన్నట్లుంది కొద్దిరోజులకే కడుపునొప్పి బాగా తీవ్రతరమైంది.
దీంతో ఆమె స్థానిక సబ్ డివిజనల్ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లింది.ఆమెను పరీక్షించిన డాక్టర్లు టెస్టుల కోసం స్కానింగ్ చేశారు.అయితే ఆమె కడుపులో ప్లాస్టిక్, వ్యర్థాలు ఉన్నట్లు స్కానింగ్ లో బయటపడింది.
100 గ్రాముల ప్లాస్టిక్, వ్యర్థాలను మహిళ కడుపులో ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.కడుపులోకి ఇవి ఎలా పోయాయోనని ఆశ్చర్యపోయారు.చివరికి ఆపరేషన్ చేసి వాటిని కడుపులో నుంచి తీసివేశారు.ఈ ఆపరేషన్ కు డాక్టర్లు హార్ట్ మ్యాన్ ఆపరేషన్ గా నామకరం చేశారు.ఆపరేషన్ తర్వాత హీరా షేర్ ఆరోగ్యం బాగుందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం ద్వారానే ఆమె కడుపులో వ్యర్థాలు ఏర్పడ్డాయని డాక్టర్లు గుర్తించారు.మంచి ఆహారం తీసుకోవాలని ఆమెకు డాక్టర్లు చెప్పారు.







