చాలా మంది వ్యక్తులు థ్రిల్ కోసం స్వింగ్ ( Swing ) చేయడానికి ఇష్టపడతారు, కానీ ఈ రోజుల్లో వీటిని ఎక్కుతున్న వారు ప్రమాదంలో పడిపోయి చివరికి నరకయాతన అనుభవిస్తున్నారు.కొంచెం అజాగ్రత్త కూడా వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది.
ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన మరొక వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అందులో ఒక అమ్మాయి స్వింగ్ చేస్తూ ఉండగా ఒక ప్రమాదం చోటుచేసుకుంది.దాంతో ఆమె తలక్రిందులుగా గాల్లో వేలాడాల్సిన పరిస్థితి వచ్చింది.

వీడియో ఓపెన్ చేస్తే మనకు ఇద్దరు అమ్మాయిలు ఊయల మీద కూర్చొని ఉండటం కనిపిస్తుంది.థ్రిల్ కోసం( Thrill ) స్వింగ్‌పై స్వారీ చేస్తున్న ఆ అమ్మాయిలకు కొన్ని సెకన్ల తర్వాత జీవితంలోనే మరిచిపోలేని షాకింగ్ అనుభవం ఎదురవుతుందని వారు ఊహించలేకపోయారు.అంతలోనే సడన్‌గా ఊయల విరిగిపోతుంది.దాంతో రైడ్ ఎంజాయ్ చేస్తున్న ఇద్దరు అమ్మాయిలలో ఒకరు ఊయల నుంచి కిందకు ఒరిగింది.అదృష్టవశాత్తు ఆమె కాలు స్వింగ్‌లో చిక్కుకు పోయింది.లేదంటే కింద పడిపోయి చనిపోయి ఉండేది.
ఆమె కాలు ఊయలలో చిక్కుకొని ఉండగా, ఆ పట్టుతోనే ఆమె ఊయలకు వేలాడుతూ తలకిందులుగా కనిపించింది.

ఈ వీడియోలో, చాలా మంది వ్యక్తులు స్వింగ్ కింద నిలబడి ఉన్నారు, వారిలో కొందరు వేలాడుతున్న అమ్మాయిని( Woman ) పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.చివరికి ఆపరేటర్( Operator ) ఈ విషయం తెలుసుకొని దానిని ఆపేసినట్లు తెలిసింది.కొద్దిగా గాయాలతో ఆమె ఈ భయంకర దుర్ఘటన నుంచి బయటపడింది.
ఈ వీడియోను @unilad అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌తో షేర్ చేసింది.హ్యాండిల్ వీడియో క్యాప్షన్‌లో, ‘మహిళ ఊయల నుండి పడిపోయింది, ఆమె తలకిందులుగా వేలాడుతోంది.’ అని రాసింది.బాలిక ఊయల నుంచి వేలాడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కెరలు కొడుతోంది.
నవంబర్ 10న అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది చూడగా, దాదాపు 40 వేల మంది లైక్ చేశారు.దీనిని మీరు కూడా చూసేయండి.







