భార్యను కష్టపడి టీచర్ చేస్తే.. భర్తకు ఊహించని షాక్..!

ప్రస్తుత సమాజంలో వివాహ సంబంధాలను( Marriages ) పక్కన పెట్టి అక్రమ సంబంధాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.రోజు కూలి పనులకు వెళ్లే ఓ వ్యక్తి తన భార్య టీచర్( Teacher ) కావాలి అనుకుంటున్న కోరిక నెరవేర్చేందుకు రాత్రి పగలు కష్టపడుతూ పొలం కూడా అమ్మి మరీ భార్య చదువుల కోసం ఖర్చు పెట్టాడు.

 Woman Dumps Labourer Hubby To Elope With Principal After Becoming Teacher Detail-TeluguStop.com

భర్త నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి టీచర్ ఉద్యోగం సంపాదించిన భార్య చివరికి భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది.తాను పనిచేసే స్కూల్లో ప్రిన్సిపాల్ తో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్త, పిల్లలను వదిలేసి వెళ్ళిపోయింది.

అసలు వివరాలు ఏమిటో చూద్దాం.

బీహార్ లోని( Bihar ) వైశాలి జిల్లా మహిపుర గ్రామం జన్హాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రోజు కూలీగా పని చేసే వ్యక్తి 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.

వీరికి 12 ఏళ్ల కుమార్తె, ఏడేళ్ల కొడుకు సంతానం.ఈ వ్యక్తి భార్యకు టీచర్ కావాలనే కోరిక ఉండేది.తన భార్య కోరిక తీర్చాలనుకున్న భర్త ఆమెను ఆ దిశగా ప్రోత్సహిస్తూ, ఆమె చదువుల కోసం కొంత పొలాన్ని( Crop ) కూడా అమ్మేశాడు.

Telugu Bihar, Elope Principal, Master, Relationship, Labourer Hubby, Mahipura, T

గత ఏడాది టీచర్ ఉద్యోగం సంపాదించిన అతని భార్య స్కూల్లో హెడ్మాస్టర్ తో వివాహేతర సంబంధం( Illegal Relationship ) పెట్టుకొని భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది.ఇక భర్త, పిల్లలను వదిలేసి హెడ్మాస్టర్ తో కలిసి వెళ్లిపోయింది.హెడ్మాస్టర్( Head Master ) తరచూ తమ ఇంటికి వచ్చి తమ తల్లిని స్కూల్ కు తీసుకువెళ్లేవాడని ఆమె పిల్లలు మీడియాతో చెప్పుకొచ్చారు.

Telugu Bihar, Elope Principal, Master, Relationship, Labourer Hubby, Mahipura, T

తన తల్లి ఆ హెడ్మాస్టర్ తో సన్నిహితంగా ఉండడం తాను చూసి తండ్రికి చెప్పడంతో తల్లి తనపై చేయి చేసుకుందని ఆ బాలిక వాపోయింది.ఆ చిన్నారులు తమ తల్లి చెడ్డదని, ఇకపై తల్లి తమ ఇంటికి రాకూడదు అని కోరుకుంటున్నట్లు చెబుతున్న దృశ్యం స్థానికులను కలచివేసింది.భార్య, స్కూల్ ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలంటూ ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube