ఇటీవలే కాలంలో ప్రేమ వ్యవహారాలు పెళ్లి ప్రస్తావన వచ్చాక ముగుస్తున్నాయి.వందలో 10 శాతం మంది ప్రేమికులే పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.
మిగిలిన 90 శాతం మంది ప్రేమికులు పెళ్లి ప్రస్తావన వచ్చాక తమ నిజస్వరూపాన్ని బయట పెడుతున్నారు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.ఓ మహిళకు వివాహం తర్వాత భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటుంది.
అయితే అదే గ్రామానికి చెందిన పెళ్లయిన యువకుడితో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి( Illegal Relationship ) దారితీసింది.పెళ్లి ప్రస్తావన వచ్చాక ప్రియుడు( Boyfriend ) అంగీకారం తెలుపకపోవడంతో ఏకంగా ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన ఘటన ఝార్ఖండ్ లోని గిరిదిహ్ జిల్లా తారాతండ్ గ్రామంలో చోటు చేసుకుంది.
ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

వివరాల్లోకెళితే.తారాతండ్ గ్రామానికి చెందిన ఓ మహిళ భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా జీవిస్తోంది.అదే గ్రామానికి చెందిన సునీల్( Suneel ) అనే యువకుడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.సునీల్ కి ఇంతకుముందే వివాహం అయింది.వీరి వివాహేతర సంబంధం కొంతకాలం పాటు సాఫీగానే సాగింది.ఆ యువతి పెళ్లి చేసుకోవాలని సునీల్ పై ఒత్తిడి తెచ్చింది.
సునీల్ మాత్రం పెళ్లికి అంగీకరించలేదు.

దీంతో సునీల్ పై కోపం పెంచుకున్న ఆ యువతీ ఒంటరిగా కలవాలని సునీల్ ను పిలిచింది.ప్రియురాలు పిలిచింది కదా అని ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే సరసాలు మొదలుపెట్టాడు.అయితే అప్పటికే ఆ యువతి సునీల్ కోసం ఎదురుచూస్తూ అతనిపై పగ తీర్చుకునేందుకు చేతిలో ఒక బ్లేడ్ ( Blade ) తీసుకుని మంచి సమయం కోసం ఎదురుచూసి సునీల్ మర్మాంగం కోసేసింది.
తీవ్ర రక్తస్రావం అయ్యి సునీల్ అక్కడికక్కడే నేలకూలి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.సునీల్ చనిపోయాడని భావించిన యువతి నేరుగా తారాతండ్ పోలీస్ స్టేషన్ కు( Taratand Police Station ) వెళ్లి జరిగిన విషయం పోలీసులకు వివరించి లొంగిపోయింది.
ఈ వార్త బయటకు రావడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.