వీడియో: బిస్కెట్లతో చెత్త ప్రయోగం చేసిన మహిళ.. ఇదేం పైత్యం అంటూ..?

సాధారణంగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ బిస్కెట్లను( Biscuits ) ఇష్టపడతారు.అందరినీ ఆకట్టుకునేందుకు బిస్కెట్లు రకరకాల వెరైటీలలో కూడా అందుబాటులోకి వస్తున్నాయి.

 Woman Biscuit Halwa Weird Dish Video Viral Details, Viral Video, Latest News, Tr-TeluguStop.com

క్రీమ్‌ బిస్కెట్ల నుంచి లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ దాకా ఎన్నో ప్రజల మనసులను దోచేసాయి.అయితే ఈ రోజుల్లో ఆడవాళ్లు సోషల్ మీడియా నుంచి డబ్బులు, లైకుల కోసం బిస్కెట్లతో సరికొత్త వంటకాలు తయారు చేస్తున్నారు.

ఆ రెసిపీ వీడియోలు దాదాపు అన్ని సోషల్ మీడియా సైట్స్ లో అప్‌లోడ్ చేస్తూ ఇంటర్నెట్ యూజర్లకు పిచ్చెక్కిస్తున్నారు.

తాజాగా ఒక మహిళ లిటిల్ హార్ట్స్ హల్వా( Little Hearts Halwa ) తయారు చేసి షాక్ ఇచ్చింది.ఆ రెసిపీకి సంబంధించిన వీడియోను @desimojito ఎక్స్ అకౌంట్ పంచుకుంది.అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ వీడియోలో( Viral Video ) ఒక పెద్ద పాన్ లేదా కడాయిలో లిటిల్ హార్ట్స్ బిస్కెట్లను,( Little Hearts Biscuits ) ఆపై మళ్లీ పార్లీ జీ బిస్కెట్లను( Parle-G Biscuits ) ఆ మహిళ యాడ్ చేయడం మనం చూడవచ్చు.తర్వాత రెండు చిన్న బాటిళ్ల ఆల్మండ్ మిల్క్ యాడ్ చేసింది.

బాదం పాలలో బిస్కెట్లు మెత్తగా తయారయ్యి ఒక పేస్టులా మారాయి.

ఆ తర్వాత కొద్దిగా షుగర్ ( Sugar ) యాడ్ చేసింది.షుగర్ మెల్ట్ అయిన అనంతరం రెండు పెద్ద స్పూన్ల నిండా నెయ్యి ( Ghee ) తీసుకొని ఆ మిశ్రమానికి జోడించింది.అనంతరం ఆ మిశ్రమంలోని తేమ ఆవిరి అయి కొద్దిగా గట్టిపడేంతవరకు బాగా గరిటెతో కలిపింది.

అనంతరం స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ దానిపై గార్నిష్ చేసింది.ఆపై వేడి వేడి హల్వా వడ్డించింది.చూసేందుకు ఇది బాగానే ఉన్నా నెటిజన్లు మాత్రం ఇంప్రెస్ అవ్వలేదు.దీన్ని తింటే ఆరోగ్యం ఖరాబు కావడం ఖాయమని చాలామంది అన్నారు ఎందుకంటే ఇది ప్రాసెస్డ్‌ ఫుడ్ అని, అతిగా చక్కెర కలిగి ఉంటుందని కామెంట్స్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube