డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్( Director Praveen Sattar ) డైరెక్షన్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Mega Prince Varun Tej ) హీరో గా గాండీవ దారి అర్జున సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే… ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకొని అది కూడా ఈ నెల 25 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కి రెఢీ అవుతున్నట్టు గా తెలుస్తుంది.
ఈ సినిమా ట్రైలర్ లో చూస్తే వరుణ్ తేజ్ లుక్ చాలా కొత్త గా ఉంది దానికి తోడు ప్రవీణ్ సత్తార్ మేకింగ్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉంది ఇక ఈ సినిమా విషయానికి వస్తె ఈ సినిమా హిట్ అవ్వడం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇద్దరికీ చాలా కీలకంగా మారనుంది ఎందుకంటే ఇద్దరి గత చిత్రాలు పెద్దగా ఆడలేదు.కాబట్టి ఈ సినిమాతో అయిన ఇద్దరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు.నిజానికి ప్రవీణ్ సత్తార్ మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ అందుకే ఆయన చేస్తున్న సినిమాలు కూడా చాలా ప్రయోగాత్మకంగా ఉంటూనే చాలా కొత్తగా కూడా ఉంటాయి.
ప్రవీణ్ సత్తార్, రాజశేఖర్( Rajasekhar ) తో చేసిన గరుడ వేగ సినిమా తర్వాత ప్రవీణ్ కి సరైన హిట్ అయితే దక్కడం లేదు.దానికి కారణం ఆయన ఎంచుకున్న కథలు అని తెలుస్తుంది అందుకే ఈసారి చాలా కసితో ఈ సినిమా చేశాడు…ఇంతకు ముందు నాగార్జున తో చేసిన ఘోస్ట్ మూవీ ప్లాప్ అయింది దాంతో ప్రవీణ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు.ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ సినిమా యూనిట్ లో భయం, భాధ్యత రెండు కూడా ఎక్కువ అవుతున్నాయని చిత్ర యూనిట్ ఈ మధ్య తెలియజేశారు…నిజానికి ఈ సినిమా వరుణ్ తేజ్ కి చాలా బాగా సెట్ అయింది ఆయన తప్ప వేరే ఎవరైనా కూడా ఈ సినిమాని ఇంత బాగా చేయలేక పోయేవారు అంటూ సినిమా యూనిట్ తెలియజేస్తుంది… వరుణ్ తేజ్ కి ఇది మరో ఫిదా లాంటి హిట్ సినిమా అవుతుంది అంటూ చెప్తున్నారు…