చంద్రబాబు విడుదల తో టిడిపి లో మిన్నంటిన భావోద్వేగం!

గత 52 రోజులుగా రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు( Chandrababu ) ఎట్టకేలకు హైకోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది.

ఆరోగ్య కారణాల రీత్యా ఆయనకు ఒక నెలరోజుల పాటు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

దాంతో తెలుగుదేశం శ్రేణుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడినట్లయ్యింది.గత కొంత కాలంగా న్యాయస్థానాలలో పరిణామాలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జరుగుతూ ఉండడంతో చంద్రబాబు విడుదలపై తీవ్ర స్తాయి ఉత్కంఠ కొనసాగింది.

మరోవైపు ప్రతివారం చంద్రబాబుకు బెయిల్ వస్తుందని ఎదురు చూడటం, కేసులు వాయిదా పడడంతో తెలుగుదేశం శ్రేణుల్లో ఒక రకమైన నిర్వేదం ఆవరించింది .అయితే ఎట్టకేలకు తాత్కాలిక ఊరటే అయినా ఒక్కసారిగా చంద్రబాబును చూసిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రస్థాయి భావోద్వేగానికి లోనయ్యారు.చంద్రబాబు కూడా తన సహజ శైలికి భిన్నంగా చాలా ఉద్వేగంగా మాట్లాడారు.

With The Release Of Chandrababu, There Is So Much Emotion In Tdp , Tdp , Chandr

52 రోజులుగా ఇబ్బందుల్లో ఉన్న తన కోసం ప్రార్థిస్తున్న తెలుగు ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు .కష్ట సమయంలో పార్టీలకతీతంగా తనకు మద్దతుగా నిలిచిన చాలామంది రాజకీయ నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.అవసరం అయిన సమయం లో ముందుకు వచ్చి పూర్తిస్థాయి మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement
With The Release Of Chandrababu, There Is So Much Emotion In TDP , TDP , Chandr

అంతేకాకుండా అధైర్య పడకుండా న్యాయం కోసం కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సైకిల్ యాత్రలు చేసిన శ్రేణులు ధైర్యాన్ని ఆయన అభినందించారు.అంతేకాకుండా హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు చంద్రబాబు పట్ల చూపిన కృతజ్ఞత ఆయన మనసును ఆకట్టుకున్నాదని ఆయన వ్యాఖ్యలు తెలియజేశాయి.

ప్రజలు నా అభివృద్ధిని గురించి చర్చించుకోవడం, నాకు కృతజ్ఞతలు చెబుతూ సమావేశాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందంటూ ఆయన తాను చేసిన అభివృద్ధిని అందరూ నెంబరు వేసుకున్నారని ఒక రాజకీయ నాయకుడిగా తన 45 సంవత్సరాల జీవితంలో ఎటువంటి అవినీతి మరకా లేదని న్యాయం కోసమే తాను బ్రతికానంటూ ఆయన భావోద్వేగంతో మాట్లాడారు.అయితే నవంబర్ 8వ తారీఖున వచ్చే కాష్ పిటిషన్ తెలుగు దేశానికి అత్యంత ముఖ్యమైనది గా భావించవచ్చు.

ఒక్కసారి గనుకక్వాష్ పిటిషన్ ఆమోదం పొందితే తెలుగుదేశం పార్టీ జెట్ స్పీడ్ లో ఎన్నికల క్షేత్రం లో కి దూసుకుపోతుంది .

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు