వ్యవసాయం చేయడంలో కొన్ని సులభ పద్ధతులు తెలుసుకుంటే తక్కువ శ్రమ తో అధిక దిగుబడి సాధించి మంచి ఆదాయం పొందవచ్చు.ఫర్టిగేషన్ టెక్నాలజీ తో పంటకు కావలసిన సూక్ష్మ, స్థూల పోషక ఎరువులు, సాగునీరు అన్ని మొక్కలకు సమానంగా అందించవచ్చు.
ముఖ్యంగా పర్యావరణం పై ఎటు వంటి ప్రభావం పడదు.
ప్రస్తుతం వ్యవసాయ రంగంలో కూలీల కొరత ఎక్కువగా ఉంది.
ఈ ఫర్టిగేషన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కూలీల అవసరం చాలా తక్కువగా ఉంటుంది.ఇంకా ఈ విధానం ద్వారా పంటలో 40 శాతం కంటే ఎక్కువ దిగుబడి సాధించవచ్చు.
ఎరువులను మొక్కలపై చల్లడం లేదంటే,మొక్కల మొదళ్ళ లో కాకుండా నేరుగా మొక్కలకు అవసరమైన పోషకాలు సరైన క్రమంలో అందించడం ద్వారా ఎరువులు వృధా కాకుండా, మంచి దిగు బడి పొందవచ్చు.

ఒక రకంగా చెప్పాలంటే ఫర్టిగేషన్ విధానంలో ఎరువుల వినియోగం తక్కువ మోతదు లో ఉంటుంది.దీని ద్వారా పంట పెట్టుబడి కూడా దాదాపుగా తగ్గుతుంది.ఇక పంటకు కావలసిన నీరు వృధా కాకుండా సమృద్ధిగా మొక్కలకు అందించవచ్చు.
ఇంతకు ముందు ఉన్న వ్యవసాయ పద్ధతులలో కూలీల వినియోగం, ఎరువుల వినియోగం, నీటి వినియోగం చాలా అధికంగా ఉండేది.దీని ద్వారా పంటకు అధిక పెట్టుబడి అవడంతో పాటు, శ్రమ అధికంగా ఉండి, వీటి ప్రభావం పర్యావరణం పై కూడా పడేది.

అదే ఫర్టిగేషన్ టెక్నాలజీలో వ్యవసాయం చేసినట్లయితే తక్కువ కూలీలు, తక్కువ మోతాదులో ఎరువులు, తక్కువ మోతాదులో నీరు వినియోగం ఉంటుంది.పైగా కలుపు సమస్య అనేది ఈ విధానం ద్వారా చాలా తక్కువగా ఉంటుంది.దీని కారణంగా పంటకు తక్కువ శ్రమ, అతి తక్కువ పెట్టుబడి తో నాణ్యమైన అధిక దిగుబడి పొంది మంచి ఆదాయం పొందవచ్చు.