జూ.ఎన్టీఆర్ ఎంట్రీతో.. లోకేశ్ అడ్రస్ గల్లంతే ?

టాలీవుడ్ టాప్ హీరో జూ.ఎన్టీఆర్ ( Jr.NTR )రాజకీయాల్లోకి రావాలని, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా మారాలని ఎప్పటి నుంచే అభిమానులు టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తూనే ఉంటారు.2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున ప్రచారం చేసిన ఎన్టీఆర్ అప్పుడే తనలోని రాజకీయ నాయకుడిని పరిచయం చేశాడు.ఆ టైమ్ లో ఎన్టీఆర్ పర్యటన.ఆయన చేసిన ప్రసంగాలు ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించాయి.ఆ ఎన్నికల్లో టీడీపీ( TDP ) ఓడిపోయినప్పటికి.ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు మాత్రం ప్రజల్లో మంచి ఇంపాక్ట్ నే క్రియేట్ చేశాయి.

 With Jr. Ntr's Entry Is Lokesh's Address Correct , Lokesh, Chandrababu, Astrola-TeluguStop.com

ఇక ఆ తరువాత నుంచి తారక్ మెల్లగా పార్టీకి దురమౌతు వచ్చారు.అవసరమైనప్పుడు పార్టీకి అండగా ఉంటానని చెప్పిన తారక్ ఇంతవరకు పార్టీ వ్యవహారాలలో ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు.

Telugu Ap, Astrolazerpvr, Chandrababu, Jr Ntr, Lokesh-Politics

అయితే తారక్ ఇలా పార్టీకి దూరం అవ్వడం వెనుక చంద్రబాబు( Chandrababu ) ప్రణాళిక ఉందని చాలమందిలో ఉన్న అభిప్రాయం.చంద్రబాబు తనయుడు లోకేష్ ను హైలెట్ చేసేందుకే, తారక్ ను పార్టీ దూరం ఉంచుతు వచ్చారనే వాదన తరచూ వినిపిస్తూనే ఉంది.ఇక ప్రస్తుతం టీడీపీకి ఈసారి ఎన్నికల్లో గెలవడం చాలా కీలకం.

ఈ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ మరింత బలహీన పడడం ఖాయం.అయితే వచ్చే ఎన్నికల్లో గెలిస్తే చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ను సి‌ఎం చేస్తారని చాలమందిలో సందేహాలు ఉన్నాయి.

ఎందుకంటే ఈసారి ఎన్నికలే తనకు చివరివని ఇప్పటికే చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.అందుకే సి‌ఎం పదవి లోకేష్ కు కట్టబెట్టి తాను రాజకీయాలకు రిటైర్ అవ్వాలని చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది.

అయితే లోకేష్ కు సి‌ఎం అయ్యే అర్హత ఉందా అంటే చాలమంది పెదవి విరుస్తున్నారు.

Telugu Ap, Astrolazerpvr, Chandrababu, Jr Ntr, Lokesh-Politics

ఈ నేపథ్యంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ పీవీఆర్ నరసింహారావు( Astrolazer PVR Narasimha Rao ) మాట్లాడుతూ.లొకేశ్( lokesh ) కు సి‌ఎం అయ్యే అర్హత లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.కానీ లొకేశ్ కంటే జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే చరిత్ర తిరగరాస్తారని, చెప్పుకొచ్చారు.దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ నేపథ్యంలో టీడీపీ వచ్చే ఎన్నికల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి అయితే ప్రచారం కోసం ఏమాత్రం ఎన్టీఆర్ ను తీసుకొచ్చిన.

టీడీపీలో లొకేశ్ అడ్రస్ గల్లంతు అవుతుందనేది కొందరు చెబుతున్నా మాట.అయితే తారక్ రాజకీయాల్లోకి వస్తే తాను ఆహ్వానిస్తానని లొకేశ్ గతంలోనే చెప్పుకొచ్చారు.మరి 2024 విజయం కొసం చంద్రబాబు తన చతురతతో ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube