వైయస్ రాజశేఖర్ రెడ్డి (Y.S.Rajashekhar Reddy) ముద్దుబిడ్డ వైయస్ షర్మిల తెలంగాణలోకి వచ్చి వైయస్ఆర్టీపి అనే పార్టీని స్థాపించి తెలంగాణలో నిరుద్యోగులు అందరిని కాపాడతానని, అధికారంలోకి వస్తే నిరుద్యోగులని లేకుండా చేస్తానని,మనమందరం ఏకమై కేసీఆర్ ని గద్దె దించాలి అంటూ ఎన్నో డైలాగులు కొట్టింది.
కానీ తీరా చూస్తే షర్మిల తనతో ఏది సాధ్యం కాదు అన్నట్లుగా వైయస్ఆర్టిపి (YSRTP) పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేస్తుంది.
ఇప్పటికే రెండు మూడు సార్లు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ని కలిసి కాంగ్రెస్లో పార్టీని విలీనం చేస్తుంది అనే టాక్ వచ్చింది.అంతే కాకుండా తనకు ఏదిచేతకాదు అని స్వయంగా తానే బయటపెట్టుకుంది అంటున్నారు ఈ విషయం తెలిసిన చాలా మంది రాజకీయ విశ్లేషకులు.
ఎందుకంటే షర్మిల (Sharmila) కాంగ్రెస్ లో పార్టీని కలుపుతుంది అనే విషయం గోప్యంగా ఉంచవచ్చు.కానీ దాన్ని తన చేతల ద్వారా బయటపెట్టి ఇరకాటంలో పడింది అని చెప్పవచ్చు.
అలాగే కాంగ్రెస్ నేతలు కూడా చాలామంది వైయస్ షర్మిలను కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు.ఓ కాంగ్రెస్ నాయకురాలు అయితే వైయస్ షర్మిల పేరు తీస్తూ తెలంగాణ ఇంటి ఆడబిడ్డ అని ఇక్కడ పార్టీ పెట్టింది.

నేను తెలంగాణ ఇంటికి కోడల్ని ఇక్కడ ఏపీ రాజకీయాలు వద్దు అన్నట్లుగా మాట్లాడింది.ఇక ఒక రకంగా చెప్పాలంటే షర్మిలని పార్టీలోకి తీసుకోవడం చాలామందికి ఇష్టం లేదు.కానీ షర్మిల మాత్రం ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ (Congress party) లో విలీనం చేద్దామా అని వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.రాహుల్ గాంధీ, సోనియాగాంధీని కలవడానికి వారి ఇంటి ముందు ఒక కార్యకర్తలా కూర్చొని వారి గురించి వెయిట్ చేయడం చాలా మందికి నచ్చడం లేదు.
ఇక ఇవన్నీ చేస్తున్న షర్మిలని చాలామంది బిఆర్ఎస్ నాయకులు ఎత్తి పొడుస్తున్నారు.

ఎందుకంటే బిఆర్ఎస్ (BRS) ని గద్దె దించే సత్తా నాకే ఉంది అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి అన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే నాకు చేతకాదు అన్నట్లుగా షర్మిల ప్రవర్తించడం చాలా హాస్యాస్పదంగా ఉంది అంటూ విమర్శలు చేస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను అనే నిర్ణయం తీసుకొని పెద్ద తప్పు చేసింది అని, తనకి తానే గొయ్యి తీసుకుంది అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.