ఏపీలో కాంగ్రెస్ ను( AP Congress ) బలోపేతం చేసే విషయంలో ఆ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా నే నిర్ణయాలు తీసుకుంటోంది.కర్ణాటక, తెలంగాణలో వరుసగా దక్కిన విజయాలు ఆ పార్టీ అగ్రనేతల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
ఏపీలో నూ కాంగ్రెస్ బలపడే అవకాశాలు ఉన్నాయని గుర్తించింది.అందుకే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం కనిపించే విధంగా వైఎస్ షర్మిలను( YS Sharmila ) కాంగ్రెస్ లోకి తీసుకున్నారు.
ఆమెకు పిసిసి అధ్యక్ష బాధ్యతలను( PCC Chief ) అప్పగించేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమవుతోంది.అయితే షర్మిలకు ఇంతగా ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవ్వడానికి కారణాలు చాలానే ఉన్నాయి.
ఏపీ , తెలంగాణ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడింది.అప్పటి నుంచి జరిగిన ఏ ఎన్నికల్లోను కాంగ్రెస్ కనీస ప్రభావం చూపించలేకపోయింది.

ఏపీ తెలంగాణ విభజన తర్వాత సాకే శైలజానాథ్,( Sake Sailajanath ) రఘువీరా రెడ్డి,( Raghuveera Reddy ) గిడుగు రుద్రరాజు( Gidugu Rudraraju ) ఇలా ఎవరిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించినా , ఏ ప్రభావం కనిపించడం లేదు .ఎలాగూ పార్టీ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో, ఎంతో కొంత ప్రభావం చూపించేందుకు షర్మిలను తీసుకొచ్చారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి.వాస్తవంగా షర్మిలను పార్టీలో చేర్చుకుని, ఆమెకు స్టార్ క్యాంపెనర్ గా బాధ్యతలు అప్పగించాలని భావించినా , షర్మిల సోదరుడు జగన్ పై( Jagan ) విమర్శలు చేసే విషయంలో ఆమె మొహమాట పడే అవకాశం ఉందని అంచనాకు వచ్చింది.

అటువంటప్పుడు ఆమెకు ఆ బాధ్యతలు అప్పగించినా పెద్దగా ఉపయోగముండదని భావించిన కాంగ్రెస్ అధిష్టానం , షర్మిలకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తే , పార్టీలో చేరికలను ప్రోత్సహించే విధంగా షర్మిల ప్రయత్నిస్తారని, ఆ విధంగానైనా పార్టీని బలోపేతం చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.అతి త్వరలోనే ఆమెకు పిసిసి బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధం అవుతోందట.