తెలంగాణ రాష్ట్ర సాధనలో బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్( CM KCR ) పాత్ర ఎలాంటిదో అందరికీ తెలిసిందే.కేంద్రంతో కోట్లాడి రాష్ట్రాన్ని సాధించిన నేతగా ప్రజల్లో కేసిఆర్ స్థానం ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది.
అందుకే రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఘన విజయాన్ని కట్టబెట్టారు రాష్ట్ర ప్రజలు.ఇక ఆయన పోటీ చేసే నియోజిక వర్గంలో తిరుగులేని మెజారిటీ కంబరుస్తూ ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కనివ్వకుండా విజయం సాధిస్తూ వచ్చారు కేసిఆర్.
గత ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేసిన ఆయన 58 వేళ మెజారిటీతో తిరుగులేని విజయాన్ని సాధించారు.

కాగా ఈసారి గత ఎన్నికలకు భిన్నంగా కేసిఆర్ రెండు చోట్ల పోటీ చేసేందుకు మొగ్గు చూపారు.గజ్వేల్ మరియు కామారెడ్డి నుంచి ఆయన బరిలోకి దిగుతుండగా.ప్రత్యర్థి పార్టీల నుంచి కేసిఆర్ ను ఢీ కొట్టే నాయకులేవరనే చర్చ గత కొన్నాళ్లుగా సాగుతూ వచ్చింది.
ముఖ్యంగా గజ్వేల్( Gajwel ) నుంచి కేసిఆర్ కు పోటీగా ఈటెల రాజేందర్ బరిలో దిగబోతున్నట్లు ఇటీవల బీజేపీ ప్రకటించిన తొలి జాబితాతో తేలిపోయింది. కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలోకి దగబోతున్నారనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేనప్పటికి పోటీ మాత్రం కేసిఆర్ వర్సస్ ఈటెల గానే సాగనుంది./br>

ఇక కామారెడ్డి నుంచి కేసిఆర్ ను ఢీ కొట్టే నేత ఎవరు అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపించాయి.కామారెడ్డి రెడ్డి నుంచి కేసిఆర్ కు పోటీగా కాంగ్రెస్ తరుపున షబ్బీర్ అలీ పోటీ చేయబోతున్నారని మొదటినుంచి కూడా వార్తలు వచ్చాయి.అయితే కేసిఆర్ తో పోటీకి దిగడానికి షబ్బీర్ అలీ వెనుకడుగు వేస్తున్నారని, ఆయన వేరే నియోజిక వర్గం ఎంచుకున్నారనే వాదన వినిపించింది.అయితే ఆ వార్తలన్నిటిని ఖండిస్తూ కేసిఆర్ కు పోటీగా తాను కామారెడ్డి నుంచే పోటీ చేయబోతున్నట్లు షబ్బీర్ అలీ( Shabbir Ali ) తాజాగా స్పష్టం చేశారు.
దీంతో గజ్వేల్ నుంచి ఈటెల, కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ.ఈ ఇద్దరు కేసిఆర్ ను ఢీ కొట్టి నిలవగలరా ? అనే దానిపై హాట్ హాట్ డిబేట్లు సాగుతున్నాయి.మరి రాష్ట్ర ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.