రోజుకి ఎన్నో రేప్ కేసుల గురించి పేపర్లో చదవుతుంటాం.కాని ఈ బాధితులపై సమాజం చూపే చులకన భావం గురించి కాని, వారిని పెళ్ళి చేసుకోవడానికి ముందుకు రాని జనాల గురించి కాని ఎప్పుడైనా ఆలోచించారా ? ఇప్పటివరకు ఆలోచించలేదు కాని, మీ ముందే ఓ రేప్ బాధితురాలు ఉంటే, ఆ అమ్మాయింటే మీకు ఇష్టం ఉంటే, పెళ్ళి చేసుకుంటారా లేక సమాజం ఏమనుకుంటుందో అని వదిలేస్తారా? ఇదే ప్రశ్న భారతీయ యువత ముందు ఉంచింది ఓ యూట్యూబ్ ఛానేల్.
యువత ఇచ్చిన సమాధానాలు మానవత్వానికి సాక్ష్యాల్లాగా ఉన్నాయి.దాదాపుగా అందరు అబ్బాయిలు తప్పకుండా పెళ్ళి చేసుకుంటాం, అందులో అమ్మాయి చేసిన తప్పు లేనప్పుడు దాన్ని సమస్యలా చూడాల్సిన అవసరం లేదనే చెప్పారు.
మీ అన్నయ్య, తమ్ముడు కాని రేప్ బాధితురాలిని పెళ్ళి చేసుకుంటే ఒప్పుకుంటారా అనే ప్రశ్నను అమ్మాయిల ముందు ఉంచితే ఆశ్చర్యకరంగా ఒక అమ్మాయి మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని బదులిచ్చింది.మిగితా అమ్మాయిలందరు ఇలాంటి మంచి పనికి తప్పకుండా మద్దత్తు ఇస్తామని చెప్పుకొచ్చారు.
“నాకు ఇష్టమైన అమ్మాయికి ఇలా జరిగితే తప్పకుండా పెళ్ళి చేసుకుంటాను.నా తల్లిదండ్రులకు ఈ విషయం అర్థమయ్యేటట్లు చెబుతాను.
మంచి పనిని పేరెంట్స్ తప్పుపట్టరు అని నా నమ్మకం.చుట్టుపక్కలవాళ్ళు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు.
ఏ అమ్మాయి కూడా కావాలని సమస్యలు కొనితెచ్చుకోదు.ఏదో చేదు సంఘటన లాగా అలాంటివి మర్చిపోవాలి” అంటూ సర్వేలో పాల్గొన్న ఓ అబ్బాయి తన అభిప్రయాన్ని వ్యక్తం చేసాడు.