దుబ్బాకకు ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం ఇస్తారా.?: ఎమ్మెల్యే రఘునందన్

తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.తాను ఏం చేశానో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.

కేసీఆర్ అంటేనే అబద్ధమని, మోసం అని ఎమ్మెల్యే రఘునందన్ ధ్వజమెత్తారు.గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లతో పోల్చి దుబ్బాకకు ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.

దుబ్బాక అభివృద్ధికి నిధులు కావాలనుకోవడం తప్పా అని నిలదీశారు.దుబ్బాకలో దళితబంధు, డబుల్ బెడ్ రూమ్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

దుబ్బాక ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే ఊరుకోనని హెచ్చరించారు.

Advertisement
వైరల్ వీడియో : అమరావతి శంకుస్థాపన వేదికకు మోకాళ్లపై కూర్చొని నమస్కరించిన సీఎం..

తాజా వార్తలు