తెలంగాణ బీజేపీ( BJP ) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు.
ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు నివేదిక ఇచ్చానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.నైతిక విలువలకు కట్టుబడి ప్రజల కోసం పని చేశానన్నారు.
భవిష్యత్ లో కూడా ప్రజల కోసం పని చేస్తానని చెప్పారు.అదేవిధంగా చివరి శ్వాస వరకు బీజేపీ కోసం పని చేస్తానన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్( Congress ) , బీజేపీ మధ్యనే పోటీ అని తెలిపారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై పోరాటం చేస్తామని చెప్పారు.
ఇక బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కవని తెలిపారు.







