భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

సినిమా రంగంలో ఎవరైతే వరుసగా సక్సెస్ లను సొంతం చేసుకుంటారో ఆ హీరోలకు మాత్రమే ప్రత్యేక గుర్తింపు ఉండటంతో పాటు సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం అయితే ఉంటుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు వరుస సక్సెస్ లతో కెరీర్ ను కొనసాగిస్తుంటే మరి కొందరు హీరోలు మాత్రం సక్సెస్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది.

ఈ హీరోలు తర్వాత ప్రాజెక్ట్ లతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.స్టార్ హీరో ప్రభాస్ కు సాహో, రాధేశ్యామ్ సినిమాల ఫలితాలతో వరుస షాకులు తగలగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది.

చిరంజీవికి సైతం సైరా నరసింహారెడ్డి, ఆచార్య సినిమా ఫలితాలతో ఎదురుదెబ్బలు తగిలాయి.ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించని నేపథ్యంలో చిరంజీవి గాడ్ ఫాదర్ తో సక్సెస్ సాధించాల్సి ఉంది.

ఆచార్య ఫలితం చరణ్ కు కూడా షాకివ్వగా శంకర్ సినిమాతో చరణ్ సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.నాగార్జున బంగార్రాజుతో సక్సెస్ సాధించినా ఆ సక్సెస్ ఆయన రేంజ్ కు తగిన సక్సెస్ కాదు.

Advertisement

తర్వాత ప్రాజెక్ట్ లతో నాగ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.నాగ్ ప్రస్తుతం ది ఘోస్ట్ సినిమాలో నటిస్తున్నారు.యంగ్ హీరో నానికి సైతం గత సినిమాల ఫలితాలు భారీ షాకివ్వగా దసరా సినిమాపైనే ఈ హీరో ఆశలు పెట్టుకున్నారు.

గోపీచంద్ కు కూడా ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేదు.

పక్కా కమర్షియల్ సినిమాతో కమర్షియల్ హిట్ ను సాధిస్తానని ఈ హీరో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.యంగ్ హీరో కార్తికేయ, కిరణ్ అబ్బవరం కూడా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.మంచు విష్ణు కూడా జిన్నా సినిమాతో తన కెరీర్ లో సక్సెస్ చేరుతుందని భావిస్తున్నారు.

ఈ హీరోలకు తర్వాత ప్రాజెక్ట్ లు సక్సెస్ ను అందిస్తాయో లేదో చూడాలి.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు