ఏపీ రాజకీయాలు ఇప్పుడు విభజన దిశగా నడుస్తున్నాయి.ఇంతకాలం తెలంగాణ ఆంధ్రాగా ఉన్న రాష్ఠ్రం ఇప్పుడు విడిపోయి.
తెలంగాణ ఏపీలుగా మిగిలిపోయాయి.ప్రస్తుతం ఉన్న ఏపీలో మరోసారి విభజన రేఖలు కనిపిస్తున్నాయి.
ప్రాంతీయంగా విభజించి ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్రా, కొస్తాంధ్రాలు.రానున్న రోజుల్లో మూడు రాష్ట్రాలుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.పేరుకు.ప్రాంతాభివృద్ధి అయినా.అంతా రాజకీయ స్వలాభం కోసం ప్రాంతాలను విభజించడం తెలిసిన విషయమే.
ఏపీలో ధర్మాన కృష్ణప్రసాద్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ మరోమారు విడిపోతుందా.? అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ఒప్పుకునేందుకు టీడీపీ ససేమీరా అంటుండటంతో.
ఆయన ఏకంగా ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు.తమకు చిన్న రాష్ట్రం ఇస్తే.
మా బాగోగులు మేమే చూసుకుంటాం అన్నారు.ఆయన చేసిన మాటలు రాజకీయంగా పెద్ద దుమారం రేపక పోయినా.
విభజనకు భీజాలు పడుతున్నాయన్నది మాత్రం వాస్తవం.చరిత్రలో చాలా ఘటనలు చిన్ని చిన్న సంఘటనలతోనే ముడిపడి ఉన్నాయి.
ప్రత్యేక రాయలసీమ కోసమంటూ.తెలంగాణ విభజన సమయంలో.
కర్నూలుకు చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గట్టిగానే కష్టపడ్డారు.అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు.

మరి అటు రాయలసీమలోనూ ఆ బీజాలు నాటుకున్నాయి.స్థానిక ప్రజల్లో కూడా ఆ వాదన ఎక్కడో ఓ మూల నాటుకుని ఉన్నాయి.వాటికి కాసిన్ని రాజకీయ నీళ్లు పడితే మహా వృక్షాలుగా మారడానికి పెద్ద టైం పట్టదు.అదే గనుక జరిగితే.ఇప్పుడు ఏపీ కూడా మరో మూడు ముక్కలుగా మారి పోవడం పక్కా అని విశ్లేషకులు అంటున్నారు.మరి నిజంగా రాష్ట్రం విడిపోయి మూడు ప్రాంతాలుగా మారితే.
నష్టపోయేది ఎవరు.? లాభ పడేది ఎవరు.? లాభం నాయకులకా.? ప్రజలకా.? అనేది వేచి చూడాలి
.






