తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు గట్టిగానే వ్యూహ రచన చేస్తున్నారు. కాంగ్రెస్ కు తెలంగాణలో బలం ఉన్నా, దానిని సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విఫలమవుతున్నారనే భావన ఆ పార్టీ వ్యవహకర్తల్లో ఉంది.
ఇప్పుడిప్పుడే పార్టీలో గ్రూపు రాజకీయాలు తగ్గడం, పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదల ఆ పార్టీ నాయకులు అందరిలోనూ కనిపిస్తుండడంతో, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు వ్యూహకర్త సునీల్ కానుగోలు వ్యవహరచన చేశారట.మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ గెలిచే అవకాశం లేకపోయినా, దాదాపు 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉందని సునీల్ తన నివేదికల ద్వారా వెల్లడించారు.

ఈ సందర్భంగా మొత్తం అన్ని నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించి ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంపై సూచనలు చేశారట.గ్రేటర్ హైదరాబాద్ లో ఎంఐఎం ప్రభావం ఉన్న నియోజకవర్గాల లో కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఆశలు వదిలేసుకుంది.అయితే ఇప్పుడు ఆ నియోజకవర్గాల పైన ఫోకస్ పెట్టాలని సునీల్ సూచించారట.ఈ మేరకు 119 నియోజకవర్గాలను గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజించారట.కాంగ్రెస్ గెలిచే నియోజకవర్గాలను గ్రీన్ జోన్ గాను, స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన నియోజకవర్గలు, కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే ల నియోజకవర్గాలను ఈ గ్రీన్ జోన్ లో చేర్చారట.

బీఆర్ఎస్ బిజెపి నుంచి గట్టి పోటీ ఎదురయ్యే నియోజకవర్గాలను పెట్టగా, గ్రీన్ ,ఆరెంజ్ జోన్ లోకి రాని నియోజకవర్గాలను రెడ్ జోన్ లో పెట్టారట.ఈ విధంగా మూడు కేటగిరీలలో అసెంబ్లీ నియోజకవర్గలను విభజించి ఆ మేరకు అక్కడ పార్టీ బలోపేతం చేయడం , ఎన్నికల ప్రచారాలు నిర్వహించడం వంటివి చేపట్టి మెజార్టీ సీట్లలో కాంగ్రెస్ పాగా వేసే విధంగా వ్యూహరచన చేస్తున్నారట.
