ఇప్పుడు కేంద్రం జగన్ ని డీల్ చేసే పద్ధతి మారుతుందా?

జగన్ ( Jagan ) ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య లోపాయి కారి ఒప్పందాలు చాలా ఉన్నాయని అందుకే ఇన్ని సిబిఐ ఈడీ కేసుల్లో ఉన్నా కూడా జగన్ స్వేచ్ఛగా బయట తిరగగలుగుతున్నారని, ఆర్థికంగా రాష్ట్రం ఇంత అధోగతి పాలైన కూడా ఇంకా కొత్త అప్పులు పుట్టించగలుగుతున్నారని ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా, సామాన్య జనంలో కూడా అనుమానాలు అయితే ఉన్నాయి.

కేంద్ర మద్దతు లేకుండా జగన్ ఈ స్థాయిలో నెగ్గుకు రాలేరని కొద్దిగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది.

ఉభయ సభలలో కలిపి 30 మంది దాకా ఎంపీలు ఉన్నారు కాబట్టే రాజకీయాల్లో ఎవరి అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పటిదాకా జగన్ విషయంలో కేంద్రం అనుకూల వైఖరితో ఉందని ఆయన అడిగిన వాటిల్లో చాలా విషయాల్ని కేంద్రం ఒప్పుకుంటుందని అయితే ఇకపై ఆ పరిస్థితి మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా కడుతున్నారు.

మరొక్కసారి రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వస్తుందనే అంచనాలు ఉండబట్టే ఇంతకాలం రాష్ట్రంలో పరిస్థితులు ఆర్థికంగా దిగజారుతున్నా, లా అండ్ ఆర్డర్ దిగజారుతున్న పరిస్థితులు కనబడుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం( Central government ) చూసి చూడకుండా వదిలేసింది .వైసీపీ ( YCP ) ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై ఉమ్మడిగా పోరాడదాం అని మిత్రపక్షం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు కేంద్ర పెద్దలకు రాష్ట్రస్థాయి నాయకులకు మొరపెట్టుకున్నా కూడా పెడచెవిన పెడుతూ వచ్చింది.రూట్ మ్యాప్ కావాలని ఆయన బహిరంగ సభలో అడిగినా కూడా కేంద్రం వైసిపి అనుకూలంగానే ఉంటూ వచ్చింది .ఈ విషయాలన్నీ గమనించే జనసేన మెల్లగా భాజాపాకు దూరం జరుగుతూ కేవలం పేపర్ మీద మాత్రమే ఇప్పుడు మిత్రపక్షంగా ఉంది .

అయితే గ్రౌండ్ లెవెల్ లో వస్తున్న మార్పులను ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకొని చూస్తున్న బిజెపి పెద్దలకు ఇప్పుడు కనువిప్పు కలిగినట్టు సమాచారం.వైసీపీ ప్రభుత్వo ప్రజా మద్దతుకు దూరమవుతుందని.జనసేన టిడిపి కూటమికి ప్రజల మద్దతు పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతుందట.

Advertisement

ఇకపై ఇంతకుముందు చూపించే అంత పాజిటివ్ వేవ్ జగన్ విషయంలో కొనసాగదని.ఇక వైసిపి పార్టీకి కష్టకాలం మొదలవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు అధికారమే పరమావధిగా స్నేహాలు వెల్లువిరుస్తాయి.

మరి ఇప్పుడు కేంద్రం కనుక మొండి చేయి చూపిస్తే రానున్న ఎన్నికల సంవత్సరంలో కేంద్రంతో అనేక అవసరాల రీత్యా వైసీపీ పార్టీ ఎలా నెగ్గుకవస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు