సమంత ( Samantha ) శాకుంతలం సినిమా తర్వాత ప్రస్తుతం ఆమె కాస్త రెస్ట్ లో ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే.అయితే ఇప్పుడు తదుపరి ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత సమంత నటించిన మరొక వెబ్ సిరీస్ సిటాడెల్.( Citadel ) అయితే ఇది చాలా రోజుల క్రితమే 2000 కోట్ల తో ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) మెయిన్ లీడ్ గా ఇంగ్లీష్ లో ఈ వెబ్ సిరీస్ లో నటించింది.
దీనికి సంబందించిన ఇండియన్ వెర్షన్ లో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతుంది.అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇంత భారీ యాక్షన్ ప్రాజెక్ట్ ఇంగ్లీష్ లో పెద్దగా జనాల ఆసక్తిని గ్రాబ్ చేయలేక పోయింది.

తొలుత ప్రియాంక చోప్రా బోల్డ్ సీన్స్ గురించి అందరూ బాగానే మాట్లాడుకున్న చాలా త్వరగానే ఆ టాపిక్ పక్కకు వెళ్ళిపోయింది.మరి ఇదే ప్రాజెక్ట్ ఇప్పుడు ఇండియన్ భాషల్లో కూడా సమంత తో తీస్తున్నారు.మరి వెస్టర్న్ ఆడియెన్స్ రిజెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ని మన ఇండియన్ ఆడియెన్స్( Indian Audience ) ఎలా హిట్ చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.అసలే సమంత కు పెళ్లి తర్వాత టైం ఏమాత్రం కలిసి రావడం లేదు.
ఒక వైపు సినిమాలు పరాజయం పాలవుతున్నాయి.మరోవైపు పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయ్యింది అలాగే ఆరోగ్యం కూడా బాగా దెబ్బ తింది.
ఈ టైం లో సిటా డెల్ కి( Citadel Webseries ) సంబందించిన నెగటివ్ ప్రచారం కూడా జరుగుతోంది.

మరి ఇన్ని అవాంతరాలు తట్టుకొని సమంత ఎలా నిలబడతుంది అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.మరోవైపు ఇండియన్స్ టేస్ట్ మేరకు అనేక మార్పులు చేస్తూ సిటా డెల్ షూటింగ్ జరుగుతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.అందుకే ఈ వెబ్ సిరీస్( Web Series ) విడుదల బాగా ఆలస్యం అవుతుంది అని కూడా అంటున్నారు.
మరి అన్ని అనుకున్నట్టుగా జరిగి సమంతకు లక్ కలిసి వస్తుందా ఇది వరకు ఉన్నట్టుగానే సమస్యల సుడిగుండం లో పడిపోతుందా అని వేచి చూస్తే తెలుస్తుంది.