ఐపీఎల్ 2022 లో జరిగిన మెగా ఆక్షన్ లో ప్రతి టీమ్ వాళ్ళకి కావల్సిన ప్లేయర్లను కొనుగోలు చేశారు.అదేవిధంగా 2025లో మరోసారి ఐపీఎల్ మెగా ఆక్షన్( IPL Mega Auction ) జరగబోతుంది.
ఇక ఐపిఎల్ అగ్రిమెంట్ ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మెగా వేలాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.దీనివల్ల ఒక్క టీంలోనే స్ట్రాంగ్ ప్లేయర్లు ఉండకుండా అన్ని టీమ్ లకు సమానమైన ప్లేయర్లు ఉంటారు అనే ఒక భావనతోనే ఐపీఎల్ లో ఇలాంటి నిబంధనని పెట్టారు.
ఇక 2025 వ సంవత్సరంలో మరోసారి మెగా వేలం నిర్వహించబోతున్నారు.
కాబట్టి చాలామంది ప్లేయర్లను ఆక్షన్ లోకి వదిలే అవకాశం అయితే ఉంది.ఇక అందులో భాగంగానే బెంగళూరు టీమ్ లో ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న డూప్లేసిస్ ను( Du Plessis ) కూడా ఆర్ సి బి( RCB ) యాజమాన్యం వదిలేయబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి.డూప్లేసిస్ మంచి ప్లేయర్ అలాగే మంచి కెప్టెన్ కూడా అయినప్పటికీ ఆయన్ని ఆక్షన్ లోకి ఎందుకు వదిలేయబోతున్నారు అనే అనుమానాలు కూడా అందరిలో వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే ప్రస్తుతం ఆయనకు ఇప్పటికే 39 సంవత్సరాలు ఉన్నాయి.ఇక తను మహా అయితే ఈ ఒక్క సీజన్ లేదంటే ఇంకొక సీజన్ లో మాత్రమే ఆడగలడు.
ఇక మెగా ఆక్షన్ లో ఒకసారి తీసుకుంటే మళ్ళీ మూడు సంవత్సరాల వరకు టీమ్ లోనే కంటిన్యూ అవ్వాలి.కాబట్టి 39 సంవత్సరాల డ్యూప్లేసిస్ ను తీసుకున్న కూడా ఆయన తన ప్రతిభను ఎంత వరకు తెలియాల్సి ఉంది.కాబట్టి డూప్లేసిస్ ని ఆర్ సి బి యాజమాన్యం కెప్టెన్ గా అలాగే ప్లేయర్ గా కంటిన్యూ చేయాలంటే ఈ సీజన్ లో తనను తాను ప్రూవ్ చేసుకుంటే తప్ప తను టీంలో కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే లేవు…చూడాలి మరి ఈసారి ఏదైనా మ్యాజిక్ చేసి ఆర్సిబికి కప్పు తీసుకొస్తాడేమో…
.