టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో సగానికి పైగా రీమేక్ సినిమాలే ఉన్నాయి.
అయితే రీమేక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, మరికొన్ని రీమేక్ సినిమాలను లైన్ లో పెట్టారు.ఇకపోతే హిందీ లో మంచి విజయం సాధించిన పింక్ సినిమాకు రీమేక్ గా పవన్ కళ్యాణ్ తెలుగులో వకీల్ సాబ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
ఇక మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా భీమ్లా నాయక్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.పవన్ వినోదయ సీతమ్ అనే మరో మరొక రీమేక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ప్రముఖ దర్శక నటుడు సముద్రఖని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం వినోదయ సీతం.దేవుడు ప్రత్యక్షమై ఓ మనిషికి తన చావు గురించి ముందే చెప్పి అతని బరువు బాధ్యతలను ముందుగానే తీర్చేసుకోమని చెబితే పరిస్థితేంటి? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

ఇందులో తంబి రామస్వామి సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటించారు.డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.అయితే సముద్ర ఖని పోషించిన దేవుడి పాత్రలో.ఇప్పుడు తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారని రూమర్స్ వస్తున్నాయి.పవన్ గతంలో వెంకటేష్ తో కలిసి నటించిన గోపాల గోపాల సినిమాలో దేవుడుగా నటించారు.ఇది హిందీలో విజయం సాధించిన ఓ మై గాడ్ చిత్రానికి రీమేక్.







