రీ రిలీజ్ కి సిద్దమైన నరసింహ నాయుడు..కనీసం ఇదైనా ఖుషి రికార్డుని కొడుతుందా..!

టాలీవుడ్ లో ఫ్యాక్షన్ జానర్ సినిమాలను మొదలు పెట్టిన హీరో నందమూరి బాలకృష్ణ.( Balakrishna ) అప్పటి వరకు ఒకే మూస లో వెళ్తున్న మాస్ కమర్షియల్ సినిమాలకు సరికొత్త నిర్వచనం తెలిపింది ఈ ఫ్యాక్షన్ జానర్ చిత్రాలు. ఆడియన్స్ కి కూడా అద్భుతమైన అనుభూతి కలగడం వల్ల ఈ జానర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ ని రఫ్ఫాడించేసాయి.‘సమరసింహా రెడ్డి’ చిత్రం తో మొదలైన ఈ ట్రెండ్ , నరసింహ నాయుడు మరియు ఇంద్ర సినిమాలతో తారాస్థాయికి చేరుకుంది.ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ కి సమరసింహా రెడ్డి మరియు నరసింహనాయుడు చిత్రాలు ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాలు.ఈ రెండు సినిమాలు కూడా రెండేళ్ల గ్యాప్ లో విడుదలై ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి.బాలయ్య ని మాస్ లో తిరుగులేని సూపర్ స్టార్ గా నిలిపాయి.‘నరసింహ నాయుడు’( Narasimha Naidu Movie ) చిత్రం టాలీవుడ్ లో మొట్టమొదటి 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టిన చిత్రం.

 Will Narasimha Naidu Movie Break Kushi Movie Re Release Records Details, Narasim-TeluguStop.com
Telugu Balakrishna, Chiranjeevi, Kushi, Simha, Pawan Kalyan, Simhadri-Movie

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ముందు పోటీకి వచ్చిన చిరంజీవి ‘మృగరాజు’ మరియు వెంకటేష్ ‘దేవి పుత్రుడు’ చిత్రాలు బోల్తాకొట్టాయి.గ్రౌండ్ లెవెల్ లో చిరంజీవి ఫ్యాన్స్ కి మరియు నందమూరి ఫ్యాన్స్ కి ఏ రేంజ్ గొడవలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అలాంటిది బాలయ్య సినిమా ముందు చిరంజీవి సినిమా ఓడిపోవడాన్ని నందమూరి అభిమానులు ఇప్పటికే గర్వంగా చెప్పుకుంటారు.అయితే మూడు నెలల గ్యాప్ లో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘ఖుషి’( Kushi Movie ) అనే లవ్ స్టోరీ తో నరసింహ నాయుడు రికార్డు కలెక్షన్స్ ని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు.

దీనిని కూడా మెగా ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునేవారు.మీ మాస్ మూవీ ని మా హీరో అర్బన్ లవ్ స్టోరీ తో బద్దలు కొట్టాడు అంటూ ఎలివేషన్స్ కూడా వేసుకునేవారు, అయితే ఇప్పుడు ఖుషి చిత్రం రీ రిలీజ్ అయ్యి, ఆల్ టైం రికార్డుని నెలకొల్పింది.

Telugu Balakrishna, Chiranjeevi, Kushi, Simha, Pawan Kalyan, Simhadri-Movie

ఈ సినిమా రికార్డు ని అందుకోవడానికి చాలా చిత్రాలు రీ రిలీజ్ అయ్యాయి కానీ, ఒక్క సినిమా కూడా ఆ రికార్డుని అందుకోలేకపోయాయి.రీసెంట్ గా భారీ హంగులు మరియు భారీ పబ్లిసిటీ తో దిగిన ‘సింహాద్రి’ చిత్రం కూడా ఖుషి ని అందుకోవడం విఫలం అయ్యింది.మరి బాలయ్య ‘నరసింహ నాయుడు’ చిత్రం ద్వారా ‘ఖుషి’ రీ రిలీజ్ రికార్డ్స్ ని బద్దలు కొడతాడా లేదా అనేది చూడాలి.ఈ చిత్రాన్ని వచ్చేనెల 10 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.ఈ చిత్రం తో పాటుగా త్వరలోనే బాలయ్య కెరీర్ లో మైల్ స్టోన్ గా నిచ్చిన ‘భైరవ ద్వీపం’ అనే సినిమా కూడా రీ రిలీజ్ కాబోతుంది, గతం లో బాలయ్య ‘చిన్న కేశవ రెడ్డి’ చిత్రం పలు ప్రాంతాలలో రికార్డ్స్ ని కూడా నెలకొల్పింది.

మరి బాలయ్య ఈ రెండు చిత్రాల రీ రిలీజ్ తో ఎలాంటి రికార్డ్స్ ని నెలకొల్పుతాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube