రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన మగధీర, బాహుబలి, బాహుబలి2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.రాజమౌళి ఈ సినిమాల ద్వారా క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయడానికి చాలా సమయం పట్టింది.బాహుబలి2 సాధించిన కొన్ని రికార్డులను ఇప్పటికీ మరే సౌత్ సినిమా బ్రేక్ చేయలేదు.స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేశారు.
అయితే ఆర్ఆర్ఆర్ రిలీజైన మూడు వారాలకే విడుదలైన కేజీఎఫ్2 సినిమా కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.బాలీవుడ్ లో కేజీఎఫ్2 సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు.
నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 546 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.గురువారం కేజీఎఫ్2 విడుదల కావడంతో లాంగ్ వీకెండ్ ను ఈ సినిమా వినియోగించుకుంది.
థియేటర్లలో మరో సినిమా నుంచి పోటీ లేకపోవడం కూడా కేజీఎఫ్2 సినిమాకు ప్లస్ అవుతోంది.
బాలీవుడ్ లో రాబోయే రోజుల్లో కూడా కేజీఎఫ్2 భారీస్థాయిలో కలెక్షన్లను సాధిస్తే మాత్రం ఆర్ఆర్ఆర్ రికార్డులు సులభంగానే బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో మాత్రం ఆర్ఆర్ఆర్ సృష్టించిన రికార్డులను కేజీఎఫ్2 బ్రేక్ చేసే అవకాశాలు అయితే లేవని చెప్పాలి.ఫుల్ రన్ లో కేజీఎఫ్2 ఆర్ఆర్ఆర్ సాధించిన రికార్డులను కచ్చితంగా బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్, డైలాగ్స్, యశ్ యాక్టింగ్ కేజీఎఫ్2 సక్సెస్ సాధించడానికి కారణమయ్యాయి.వాస్తవానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాలేదు.అయితే మౌత్ టాక్ బాగుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు.కేజీఎఫ్2 ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.ఆర్ఆర్ఆర్ ఇప్పటివరకు 1100 కోట్ల రూపాయలకు అటూఇటుగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.







