ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి2 సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు హిందీలో 510 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.ఈ రికార్డులను ఇప్పటివరకు మరే సౌత్ సినిమా బ్రేక్ చేయలేదు.
ఆర్ఆర్ఆర్ సినిమా హిందీలో ఫుల్ రన్ లో 300 కోట్ల రూపాయలకే పరిమితమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.అయితే కేజీఎఫ్2 బాలీవుడ్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.
కేజీఎఫ్2 ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసింది.అయితే ఫుల్ రన్ లో బాహుబలి2 రికార్డులను కేజీఎఫ్2 బ్రేక్ చేసే అవకాశం లేదని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నారు.
వీక్ డేస్ లో బాలీవుడ్ లో కేజీఎఫ్2 సినిమాకు ఇప్పటికే కలెక్షన్లు తగ్గాయి.మరోవైపు రేపు థియేటర్లలో హిందీ జెర్సీ మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
ఏప్రిల్ 29వ తేదీన మరో రెండు హిందీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.
ఈ సినిమాల టాక్ ను బట్టి కేజీఎఫ్2 కలెక్షన్లు ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు.

కేజీఎఫ్2 హిందీలో ఫుల్ రన్ లో 350 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే కేజీఎఫ్2 ఫుల్ రన్ కలెక్షన్లను చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.కేజీఎఫ్2 ఫుల్ రన్ కలెక్షన్లు ఏ మేరకు ఉండబోతున్నాయో చూడాలి.

కేజీఎఫ్2 సినిమా నటీనటులతో పాటు దర్శకునికి కూడా ఎంతో క్రేజ్ ను తెచ్చిపెట్టింది.కేజీఎఫ్2 సినిమా సక్సెస్ వల్ల నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వచ్చాయి.280 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా మేకర్స్ కు ఈ సినిమా రెట్టింపు స్థాయిలో లాభాలను అందిస్తోంది.కేజీఎఫ్2 ఫుల్ రన్ లో నిర్మాతలకు మరింత లాభాలను అందించే ఛాన్స్ అయితే ఉంది.







