కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా గత రెండు నెలలకు పైగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.ప్రజలను కరోనా బారిన పడకుండా ఉంచేందుకు ఈ లాక్‌డౌన్ విధించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.
అయితే రెండు నెలల తరువాత లాక్‌డౌన్ నుండి పలు దఫాలుగా సడలింపులు ఇస్తూ వస్తుండటంతో ప్రస్తుతం జనం తమ పనులకు తిరిగి వెళ్తున్నారు.కానీ అసలు సినిమా ఇక్కడే మొదలైంది.
లాక్‌డౌన్ నుండి సడలింపులు ఇచ్చే సమయానికి చాలా తక్కువ సంఖ్యలో కేసులు ఉన్నాయి.
కానీ లాక్‌డౌన్‌ను సడలిస్తూ వస్తుండటంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతూ వస్తోంది.
ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో కరోనా పంజా విసురుతూ వస్తోంది.తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో 80 శాతానికి పైగా హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి.
దీంతో తెలంగాణ సర్కార్ కరోనా వ్యాప్తిను ఎలా నియంత్రించాలా అనే విషయంపై తలపట్టుకుంది.మరోసారి కీలక నిర్ణయం తీసుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం రెడీ అయ్యింది.
వైద్యాధికారులు సూచనల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి 15 రోజులపాటు లాక్‌డౌన్ విధించాలని వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచించారు.
తాజాగా ఈ అంశానికి సంబంధించి సీఎం కార్యాలయం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
మరో మూడు నాలుగు రోజుల్లో సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలో లాక్‌డౌన్ విధింపుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.కరోనా వ్యాప్తిని నివారించేందుకు లాక్‌డౌన్ తప్ప మరో మార్గం లేదని అధికారులు అంటున్నారు.
అయితే మరోసారి లాక్‌డౌన్‌కు ప్రజలు సిద్ధంగా ఉంటారా లేరా అనేది చూడాలి.మరి లాక్‌డౌన్ విషయంలో కేసీఆర్ నిర్ణయం ఏమిటో చూడాలి.