ఎమ్మెల్సీ ఎన్నికల్లో కెసీఆర్ కు భారీ షాక్ తగలనున్నదా?

తెలంగాణలో చాలా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ చాలా ప్రశాంతంగా సాగుతుంది అనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఒకటి రెండు చోట్ల జరుగుతున్న పరిణామాలు కాస్త ఆసక్తికరంగా ఉన్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం చాలా వరకు అంటే ఇప్పటికే 13 ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న టీఆర్ఎస్ ఇంకా మిగతా స్థానాలపై కూడా కన్నేసిన పరిస్థితి ఉంది.

 Will Kcr Get A Huge Shock In The Mlc Elections Details, Telangana Politics, Cm K-TeluguStop.com

మొత్తం అన్ని ఎమ్మెల్సీ స్థానాలను గెలిచే సత్తా ఉన్న పరిస్థితిలో కూడా రెబల్స్ దెబ్బతో టీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలే అవకాశం వంద శాతం ఉన్న పరిస్థితి ఉంది.అందుకే ముందు జాగ్రత్తగా కొంత మంది ఎంపీటీ సీలను క్యాంపులకు కూడా తరలిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఇటీవల జరిగిన విలేఖరుల సమావేశంలో కెసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చేసిన కామెంట్స్ ఒకింత మరోరకమైన చర్చకు దారి తీసిన పరిస్థితి ఉంది.మాకు గెలిచామనే అహంకారం ఉండదని, ఒడితే రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఒడిపోతాం అది ఏమైనా పెద్ద సమస్యా అని కెసీఆర్ పరోక్షంగా వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది.

అయితే కెసీఆర్ చాలా చాకచక్యంగా చెప్పినా అధికారంలో ఉన్న పార్టీ రెండు స్థానాలలో ఓడిపోవటం అన్నది రాజకీయంగా చాలా పెద్ద విషయం.

Telugu @cm_kcr, @trspartyonline, Mlc Sided, Bandi Sanjay, Bjp, Kcr, Telangana Ml

అయితే ఈ విషయం పట్ల టీఆర్ఎస్ పార్టీలో పెద్దగా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది.ఎందుకంటే చాలా వరకు క్షేత్ర స్థాయిలో బీజేపీ తన బలాన్ని పెంచుకుంటున్న పరిస్థితిలలో ఓడిపోయిన ఒకటి లేదా రెండు స్థానాలతో బీజేపీ రాజకీయం చేసి టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే అవకాశం ఉంది.మరి రానున్న రోజులలో ఎమ్మెల్సీ ఎన్నికల అంశం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

రెబెల్స్ వ్యూహాలను టీఆర్ఎస్ దెబ్బ కొడుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube