‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలతో విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్న దర్శకుడు క్రిష్.ఈ మూడు సినిమాలు కూడా బాక్సాపీస్ వద్ద సందడి చేయడంలో విఫలం అయ్యాయి.
అయితే వైవిధ్యభరిత చిత్రాలను ఆధరించే వారు మాత్రం ఈయన సినిమాలకు ఫ్యాన్స్ అవుతున్నారు.తాజాగా ఈయన తెరకెక్కించిన చిత్రం ‘కంచె’.
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ టీజర్ తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా విడుదల అయ్యింది.వచ్చే నెలలో ఆడియోను విడుదల చేసి, అక్టోబర్ 2న సినిమాను విడుదల చేస్తాం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
తాజాగా విడుదలైన టీజర్‌కు విమర్శకుల నుండి మంచి స్పందన వస్తోంది.అయితే ఈసారి కూడా క్రిష్ కమర్షియల్ సక్సెస్‌ను అందుకోవడం కష్టమే అని విశ్లేషకులు అంటున్నారు.
‘గమ్యం’, ‘వేదం’లాగే ‘కంచె’ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు లేవని, మాస్ ఆడియన్స్‌కు నచ్చే అంశాలు ఈ సినిమాలో కనిపించవేమో అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.‘ముకుంద’ సినిమాతో పరిచయం అయిన వరుణ్ తేజ్ ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్‌ను కొట్టేందుకు ఎదురు చూస్తున్నాడు.
రెండవ ప్రపంచ యుద్ద సమయంలో నెలకొన్న పరిస్థితు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.దర్శకుడు క్రిష్ చాలా న్యాచురల్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.
‘కంచె’ కమర్షియల్ సక్సెస్ సాధించకున్నా కూడా విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకోవడం ఖాయం.







