మెగా బ్రదర్స్‌ పోటా పోటీగా..!!

టాలీవుడ్‌లో చిరంజీవి, నాగబాబు, పవన్‌ కళ్యాణ్‌లను మెగా బ్రదర్స్‌ అంటారు.ఇక కోలీవుడ్‌లో సూర్య మరియు కార్తీలను మెగా బ్రదర్స్‌ అంటారు.

 Karthi And Suriya Movies Hulchul In Tamil-TeluguStop.com

ఇప్పుడు ఈ వార్త తమిళ మెగా బ్రదర్స్‌ గురించి.ప్రస్తుతం సూర్య ‘24’ సినిమాలో నటిస్తున్నాడు.

సమంత హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో సూర్య తన సొంత నిర్మాణ సంస్థ అయిన 2డి ఎంటర్‌టైన్స్‌మెట్స్‌లో నిర్మిస్తున్నాడు.ఈయన గతంలో కూడా జ్యోతిక ముఖ్య పాత్రలో నటించిన ఒక సినిమాను ఈ నిర్మాణ సంస్థలో సూర్య నిర్మించాడు.

కాని భారీ బడ్జెట్‌తో మొదటి సారి సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఇక అన్న దారిలోనే మెగా బ్రదర్‌ కార్తీ కూడా నిర్మాణ సంస్థను ప్రారంభించాడు.

తమిళంతో పాటు తెలుగులో కూడా సక్సెస్‌ ఫుల్‌ హీరోగా దూసుకు పోతున్న కార్తి ప్రస్తుతం ‘కాష్మోర’ సినిమాలో నటిస్తున్నాడు.భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇక ఈ సినిమాను కార్తీ ప్రిన్స్‌ ప్రొడక్షన్‌ పేరుతో నిర్మిస్తున్నాడు.గతంలో ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా జ్ఞానవేల్‌ రాజా నిర్మాణంలో ఎక్కువ సినిమాలు నటించారు.

వీరి సినిమాలు అనగానే గ్రీన్‌ స్టూడియో బ్యానర్‌ గుర్తుకు వచ్చేది.కాని ఇప్పుడు వీరిద్దరు కూడా విడి విడిగా బ్యానర్‌లు ప్రారంభించడం ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో గుసగుసలకు తావిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube