సూపర్ స్టార్ మహేష్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ యావరేజ్ విజయం సాధించగా, ‘ఖలేజా’ ఫ్లాప్ అయ్యింది.అయినా కూడా వీరిద్దరి కాంబినేషన్‌కు ఫుల్ క్రేజ్ ఉంది.
వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.గత రెండు మూడు సంవత్సరాలుగా వీరి సినిమా గురించి మీడియాలో వార్తలు రావడం చూస్తూనే ఉన్నాం.
తాజాగా త్రివిక్రమ్‌తో సినిమాపై మహేష్‌బాబు అధికారికంగా స్పందించాడు.
మహేష్‌బాబు నటించిన తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ ఘన విజయం సాధించడంతో సంతోషంగా ఉన్నాడు.
ఈయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని పంచుకున్నాడు.అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాపై కూడా క్లారిటీ ఇచ్చాడు.
తాను త్వరలో ‘బ్రహ్మోత్సవం’ సినిమా చేయనున్నాను అని, అది పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని అంటున్నారు.‘బ్రహ్మోత్సవం’ సినిమా ఇదే సంవత్సరం డిసెంబర్‌లో పూర్తి చేయనున్నారు.
దాంతో వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్‌బాబు సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందని తేలిపోయింది.వీరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడవ సినిమాపై ఇప్పటి నుండే అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి.







