డ్రైవింగ్ సీటు జనసేన దేనా?

ఇప్పటివరకు జనసేన తెలుగుదేశం పొత్తులలో మేజర్ పార్ట్నర్ అయిన తెలుగుదేశమే ఎక్కువ లబ్ధి పొందుతుందని విశ్లేషణ లు వినిపించాయి.ముఖ్యంగా తెలుగుదేశానికి స్టార్ క్యాంపెనర్గా పవన్( Pawan Kalyan ) ఉపయోగపడతాడని, తక్కువ వచ్చే ఆ ఐదు నుంచి పది శాతంఓట్లు జనసేనతో( Janasena ) పొత్తు వల్ల వస్తాయని అంతిమంగా తెలుగుదేశం లాభపడి అధికారంలోకి వస్తుందని జనసేనకు నామమాత్రంగా సీట్లు కేటాయిస్తుందని పొలిటికల్ ఇంజనీరింగ్ లో సిద్ధహస్తుడైన బాబు జనసేన పార్టీని అన్ని రకాల గానూ వాడుకొని వదిలేస్తాడు అంటూ కూడా ఒక సెక్షన్ మీడియా వార్తలు ప్రసారం చేసింది.

 Will Janasena Pawan Kalyan Lead Tdp After Chandrababu Arrest Details, Janasena,-TeluguStop.com

అయితే ఎప్పుడైతే చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) జరిగిందో పరిణామాలన్ని ఒక్కసారిగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా మారిపోయాయి.

ముఖ్యంగా కోర్టులలో వరుసగా చుక్కెదురవ్వటం , వ్యతిరేక తీర్పులు రావడం మరోపక్క యువగళం పాదయాత్ర ఆగిపోవడం, అరెస్టు భయంతో లోకేష్( Nara Lokesh ) ఢిల్లీలోనే ఉండి పోయారన్న వార్తలు వెరసి తెలుగుదేశం లో( TDP ) నాయకత్వ కొరత స్పష్టంగా కనిపిస్తుంది.

ఎన్నికలు దూసుకొస్తున్న ప్రస్తుత తరుణంలో పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాల్సిన పరిస్థితి లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన తెలుగుదేశం పార్టీని పట్టి కుదిపేస్తుంది.

Telugu Chandrababu, Janasena, Lokesh, Pawan Kalyan, Tdpjanasena-Telugu Political

ఇలాంటి పరిస్థితుల్లో ముందుకు వచ్చి మద్దతు ఇచ్చిన జనసేనకు ఆటోమేటిక్గా డ్రైవింగ్ సీటు దక్కినట్టుగా తెలుస్తుంది.ముఖ్యంగాఎన్నికలప్రచారం పూర్తిగా జనసేనాని భుజస్కందాలపై పడినట్లుగా తెలుస్తుంది.దాంతో తెలుగుదేశం జనసేనలకు ఉమ్మడిప్రచారకర్తగా పవన్ మిగిలారు.

దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ దర్శకత్వంలో ముందుకెళ్లాల్సిన పరిస్థితి తెలుగుదేశానికి ఏర్పడింది.బాబు ( Chandrababu Naidu ) వచ్చేవరకూ నిర్ణయాలను వాయిదావేస్తే ముంచుకొస్తున్న ఎన్నికలలోఅది వ్యూహాత్మక తప్పిదం అవుతుంది.

దాంతో బాబు ఉన్నా లేకపోయినా కార్యాచరణను ముందుకు తీసుకు వెళ్ళవలసిన పరిస్థితి తెలుగుదేశానికి ఏర్పడింది.

Telugu Chandrababu, Janasena, Lokesh, Pawan Kalyan, Tdpjanasena-Telugu Political

దాంతో ఇప్పుడు పవన్ కేంద్రంగానే అని నిర్ణయాలను టిడిపి తీసుకుంటునట్లుగా తెలుస్తుంది.ఉమ్మడి మేనిఫెస్టో అంటూ ఇప్పుడు కొత్తగా వార్తలు వస్తున్నాయి.దాంతో పవన్ కోరుకున్నగౌరవాన్ని సీట్ల రూపంలో చూపాల్సిన పరిస్థితి తెలుగుదేశానికి ఏర్పడిందట .దాంతో జనసేనకు కాలం కలిసి వచ్చినట్లే చెప్పాలి.ఉన్నఈ తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకొని జనసేన సంస్తగతం గా బలపడితే 2029 వరకూ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చే బలాన్ని సంతరించుకోగలుగుతుంది .మరి అందువచ్చిన ఈ అవకాశాన్ని జనసేనా ని ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube