తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
రానున్న లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections ) నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. ఖమ్మం నియోజకవర్గం( Khammam Constituency ) నుంచి పోటీ చేయాలని అక్కడి పార్టీ క్యాడర్ అడుగుతున్నారని పేర్కొన్నారు.
పార్టీ కోసం తనకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్లు ఉన్నారా అని ప్రశ్నించారు.
అలాగే భారత్ లో తనకంటే ఎక్కువ తిరిగే నాయకుడు ఉన్నారా అని అడిగారు.ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )పై తనకు నమ్మకం ఉందన్నారు.ఏం తప్పు చేశానని తనను పక్కన పెట్టారన్న వీహెచ్ కొత్తగా పార్టీలోకి వచ్చిన వారంతా టికెట్లు అడిగితే తన లాంటి సీనియర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
గతంలోనూ తనకు అన్యాయం జరిగిందని తెలిపారు.