“బట్టీ ప్రచారం“ తో తెలిపోతున్న బిజెపి?

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజెపి( BJP ) మార్కు ప్రచారం ఒకటి ఉంటుంది .బజాపా అగ్ర నాయకులు అంతా అక్కడ వాలిపోయి యధాశక్తి తమ ప్రచారం చేసి వస్తారు.

 Will Bjp Be Trailed In The Campaign , Campaign , Bjp, Congress , Ts Politics ,n-TeluguStop.com

అయితే స్థానిక పరిస్థితులను అక్కడి వాతావరణం పట్టించుకోకుండా కేవలం స్థానిక నాయకులు రాసిచ్చిన స్క్రిప్టును బట్టి పట్టి చదవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, పేరుకి ఇంతమంది ప్రచారం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నా కూడా వారు తెలంగాణ ఓటర్ ను ఏ విధంగానూ ప్రభావితం చేయలేకపోతున్నారన్నది ప్రధానంగా వినిపిస్తున్న విశ్లేషణ.ముఖ్యంగా అమిత్ షా, మోడీ( Narendra Modi ) లాంటి అగ్ర నాయకులను పక్కన పెడితే మిగిలిన నాయకులు కేవలం చూసి చదవడానికి సమయం కేటాయిస్తున్నారు తప్ప స్థానికులను ఆకట్టుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారట .

Telugu Amit Shah, Bjp Manifesto, Congress, Kishan Reddy, Narendra Modi, Ts-Telug

కనీసం వీరెవరికి తెలంగాణ స్థానిక పరిస్థితులు అసలు తెలుసా లేదా అన్న ప్రశ్నలు కూడా వినిపించడం గమనార్హం.ఎంతసేపూ బారాసా అవినీతి చేసిందని, బారాసాను ఓడించాలని, కాంగ్రెస్ను ఖతం చేయాలనే నినాదాలు ఇవ్వడానికే తప్ప అసలు బిజెపిని ఎన్నుకోవడానికి అవసరమైన కారణాలు ఏమిటి? బిజెపిని ఎందుకు గెలిపించాలి? బిజెపి గెలిస్తే తెలంగాణ సమగ్ర స్వరూపంలో వచ్చే మార్పులు ఏమిటి ? ఏ ఏ వర్గాలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది? ఇంతవరకు పరిపాలించిన ప్రభుత్వాలు తెలంగాణకు చేసిన అన్యాయం ఏమిటని విశ్లేషణాత్మక వివరించడంలో మాత్రం ఈ నాయకులు విఫలమవుతున్నారనే చెప్పాలి.కేవలం పార్టీ అధిష్టానం ఆదేశించింది కాబట్టి ప్రచారంలో పాల్గొని బట్టి పట్టింది అప్ప చెబుతున్నారే తప్ప వీరి ప్రచారం వల్ల పార్టీకి జరుగుతున్న లాభం ఏమిటో కూడా స్పష్టంగా తెలియట్లేదు అన్నది రాజాకీయ పరిశీలకుల విశ్లేషణ.

Telugu Amit Shah, Bjp Manifesto, Congress, Kishan Reddy, Narendra Modi, Ts-Telug

బిజెపి మార్పు ప్రచారం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉపయోగపడదని , మతపరమైన అంశాలకు దక్షిణాది రాష్ట్రాలు అంత యాక్టివ్గా స్పందించవన్న విశ్లేషణ ఉంది .అలాంటప్పుడు అవినీతి అభివృద్ధి ప్రధాన అజెండాగా ప్రచారం చేయవలసిన భాజపా నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారన్నది విశ్లేషణ.మరి ఇప్పటికే మేనిఫెస్టో ( BJP Manifesto )లోను సంతృప్తి పరచలేకపోయిన భాజపా ఇప్పుడు ప్రచారంలో కూడా వెనకబడే ఉందన్నది సమాచారం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube