భాజపా “బీసీ సీఎం” గేమ్ చెంజర్ అవుతుందా ?

తెలంగాణలో రాజ్యాధికారం కోసం జరుగుతున్న పోటీ ప్రదానం గా కాంగ్రెస్ బారసాల మధ్యనే నిక్షిప్తమైనదని అని భాజపా( BJP ) రేసులో వెనకబడిందని నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చిన విషయం విదితమే .అయితే చివరి నిమిషము సర్దుబాటులతో భాజపా తనదైన శైలిలో కింగ్ మేకర్ గా మారడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది.

 Will Bjp Bc Cm Be A Game Changer Details, Bjp, Telangana Bjp, Bc Chief Minister,-TeluguStop.com

ముఖ్యంగా జనసేనతో ( Janasena ) ఆ పార్టీ పొత్తు కొన్ని నియోజకవర్గాలలో మంచి ప్రభావమే చూపిస్తుందని విశ్లేషణలు వస్తుండగా మరోవైపు కీలకమైన ప్రచార అస్త్రాన్ని సూర్యాపేట జనగర్జన సభ వేదికగా ఆ పార్టీ కీలక నేత మరియు హోం మినిస్టర్ అమిత్ షా( Amit Shah ) ప్రకటించారు.

Telugu Amit Shah, Bc, Cm Kcr, Congress, Dalit Cm, Rahul Gandhi, Telangana Bjp, T

భాజపాక తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ నేతనే ముఖ్యమంత్రిని( BC Chief Minister ) చేస్తామని ఆయన ప్రకటించారు.బారాస గెలిస్తే కేటీఆర్ ని( KTR ) ముఖ్యమంత్రిని చేస్తారని, కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ ని ( Rahul Gandhi ) ప్రధాని చేయాలని సోనియా చూస్తారని వీరికి కుటుంబ రాజకీయాలు, అధికారాలే ముఖ్యం తప్ప ప్రజల అభివృద్ది గురించి పట్టించుకోరని, భాజపా మాత్రమే ప్రజల ఆశలు ఆకాంక్షల కోసం పనిచేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ( KCR ) ఈసారైనా ఆ పని చేయగలరా? అంటూ ఆయన సవాలు విసిరారు.ముక్కోణపు పోటీలో ప్రతి ఓటు కీలకమని ప్రచారం జరుగుతున్న దరిమిలా కొన్ని నియోజకవర్గాలలో బలం ఉన్న బిజెపి 15 నుంచి 20 ఎమ్మెల్యే స్థానాలను కనుక గెలుచుకుంటే గేమ్ చేంజర్ గా మారే అవకాశం కనిపిస్తుంది.

Telugu Amit Shah, Bc, Cm Kcr, Congress, Dalit Cm, Rahul Gandhi, Telangana Bjp, T

అప్పుడు బిజెపికి కింగ్ మేకర్ గా అవకాశం వస్తుంది .దానికోసం ఆ పార్టీ కీలక ప్రయత్నాలను మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది.గెలుపు గుర్రాల గా భావించే కొంతమంది కీలక నాయకులను బరిలోకి దింపడం ద్వారా తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది .మరి బీసీ ముఖ్యమంత్రి అస్త్రానికి తోడు జనసేన మద్దతు కూడా తోడైతే బిజెపి ఆశిస్తున్న కీలక స్థానాలను గెలుచుకుంటే మాత్రం తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరం గా మారతాయని చెప్పవచ్చు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube