బాస్ బర్త్‌డే ముందే ఆచార్య క్లారిటీ ఇస్తాడా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం మెగాఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాతో మరోసారి మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సామాజిక అంశంతో పాటు కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండే విధంగా తీర్చిదిద్దడంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది.

గతేడాది రావాల్సిన ఆచార్య కరోనా కారణంగా వాయిదా పడింది.ఇక మొదటి వేవ్ ముగిసిన తరువాత వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ సెకండ్ వేవ్ మరోసారి ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకుంది.దీంతో ఈసారి ఈ సినిమాను ఎలాగైనా రిలీజ్ చేసే సమయంలో ఎలాంటి అడ్డంకులు ఎదురవకుండా ఉండేలా చిత్ర యూనిట్ ముందుచూపుతో వెళ్తోంది.

Advertisement

ఈ క్రమంలోనే దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.అయితే ఆ సమయంలో భారీ పోటీ నెలకొనడంతో ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది సందేహంగా మారింది.

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంపై మాత్రం మెగాస్టార్ బర్త్‌డే కంటే ముందే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తే బావుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.మెగా ఫ్యాన్స్‌ను మరిన్ని రోజులు ఆచార్య రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేయించడం మంచిది కాదని వారు భావిస్తున్నారు.

దీంతో ఈసారి మెగాస్టార్ పుట్టినరోజున ఆచార్య రిలీజ్ డేట్ కన్ఫం చేస్తారనే వార్త ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌లో కొత్త సందడిని నింపుతోంది.కాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తుండగా, అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా ఈ సినిమాలో నటిస్తోంది.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి
Advertisement

తాజా వార్తలు